బీజేపీ ఆ దేశంలో కూడా సత్తా చాటుతోందా?

Chakravarthi Kalyan
నేపాల్ హిందూ దేశం. తర్వాతి కాలంలో హిందుత్వాన్ని అంగీకరించిన వారు అక్కడ దాదాపు 10 శాతం పెరిగారు. తర్వాత ఎప్పుడైతే రాజును చంపేసి కమ్యూనిస్టులు అధికారం చేపట్టారు. తర్వాత చైనా ఎలా చెప్పినా అలా వినే వారు అధికారంలో ఉండిపోయారు. ముఖ్యంగా అధికార పక్షం, ప్రతిపక్షం అందరూ కూడా కమ్యూనిస్టు పార్టీల వారే కావడం విశేషం. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ చెప్పినట్లు వినే పార్టీలు అధికారం చెలాయించినా ఇప్పుడు పూర్తిగా చైనా అధీనంలోకి  వచ్చేసింది.


ఇండియాకు చెందిన పార్టీలు నేపాల్ లో రాజకీయాలు చేయలేదు. కానీ పక్కనే ఉండే దేశంలో అది హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభావం ఏమిటి అనుకున్నారో ఏమో కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ పాగా వేయాలని ప్రయత్నం చేస్తోంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ భావజాలాన్ని అంగీకరించే పార్టీ ఎన్ జేపీ నేపాల్ లో  ఆవిర్భవించింది.


అక్కడ జరిగిన స్థానిక ఎన్నికల్లో కమలం గుర్తుపైనే పోటీ చేసింది. దాదాపు 17 స్థానాల్లో గెలిచింది. భారత దేశం నుంచి మరో పార్టీ నేపాల్ లో గెలవడం అనేది హిందుత్వం అంటున్నారు. పొరుగు దేశం కూడా చైనా ఆధీనంలోకి వెళ్లకుండా రాబోయే రోజుల్లో ఇండియా తరఫున ఉన్న పార్టీలు నేపాల్ లో అధికారంలో ఉండే దేశానికి ఉపయోగ పడే పని అనొచ్చని కొంతమంది అంటున్నారు.


దీనిపైన రాబోయే రోజుల్లో భారీగానే చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దేశం కానీ దేశంలో భారతీయ జనతా పార్టీ గుర్తుతో ఒక పార్టీ పోటీ చేయడం, దేశం దాటి బీజేపీ విస్తరించే అవకాశం ఉందా? ఇది నేపాల్ తో ఆగిపోతుందా? లేక భారతీయులు ఎక్కువగా ఉండే అన్ని దేశాల్లో దీన్ని కొనసాగిస్తారా? వచ్చే ఎన్నికల్లో నేపాల్ లో బీజేపీ అనుకూల ఎన్ జేపీ అధికారంలోకి వస్తుందా? రాబోయే కాలంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: