రహస్యం: ఇండియా బియ్యం భారీగా కొంటున్న చైనా..?
అయితే ఈ విషయంపై చైనాని ఎవరూ లోతుగా అర్థం చేసుకోలేదు. అక్కడ వరదలు రావడం వల్ల పంటలు దెబ్బ తిన్నాయి ఈ మధ్య. దానివల్ల తినడానికి బియ్యం దొరకక ఈ విధంగా భారత్ వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసుకుంటుందని అనుకున్నారు అందరూ. కానీ అసలు నిజం వేరే ఉంది చైనా వద్ద. రాజుల కాలంలో ఎక్కువగా యుద్ధాలనేవి ఆడవారి వల్ల వచ్చేవి అంటారు. కానీ భవిష్యత్తులో రెండు దేశాలు కొట్టుకున్నాయంటే దానికి బలమైన కారణం నీటికి సంబంధించిందే అవుతుంది అని అంటున్నారు చారిత్రక నిపుణులు.
పోతులూరి వీరబ్రహ్మం గారు కూడా తన కాలజ్ఞానంలో ఇదే మాటను ప్రస్తావించారు. నీటి కోసం దేశాలు కొట్టుకుంటాయని ఆయన తెలిపిన సంగతి చాలామందికి తెలిసిన విషయమే. అయితే చైనా ఇప్పుడు ఎందుకు ఈ విధంగా భారత్ నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది అనే విషయం ప్రపంచానికి తెలిసింది. ఒక కేజీ ధాన్యాన్ని పండించాలంటే చైనాలో రెండు వేల నుండి మూడు వేల లీటర్ల నీరు ఖర్చవుతుందని అంటారు.
కానీ భారత్ లో అయితే కేవలం 400 నుండి 500 లీటర్ల నీటితో ఈ వరి సాగు అనేది చేయవచ్చు. తమ వద్ద వరి అనేది పండిస్తే ఎక్కువ నీరు ఖర్చయిపోతుంది కాబట్టి చైనా ఇప్పుడు భారత్ లాంటి దేశాల దగ్గర నుండి బియ్యాన్ని కొనుగోలు చేస్తుంది.