ఆ కేసుల పేరు చెప్పిన జగన్‌కు పవన్ వార్నింగ్?
విశాఖపట్నంలోని వందల కోట్ల భూముల్లో జరుగుతున్న పనులను పవన్ ఇటీవల పరిశీలించారు. సీబీసీఎస్సీ భూముల పరిశీలనలో జనసేన మరో నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. జగన్ సింహచలం అప్పన్న భూములు, క్రిస్టియన్ మైనార్జీ భూములు, అనే తేడా లేకుండా అన్నింటిని దోచేస్తున్నారని అన్నారు. అత్యంత విలువైన భూములు జనవాణి కార్యక్రమంలో రాష్ట్ర క్రిష్టియన్ మైనార్జీ నాయకులు ఇచ్చిన కంప్లైంట్ గురించి ఇక్కడికి వచ్చానన్నారు. ఎంతో విలువైన క్రిస్టియన్ మిషనరీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు.
ఈ భూముల్లో జరుగుతున్న పనులు సరైనవి కావని అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో తెలుసుకున్నాకే ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఈ భూముల గురించి సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కూడా ఇక్కడ క్షేత్ర స్థాయిలో పనులు జరగడం విచారకరమన్నారు. చట్టం పట్ల జగన్ కు ఎలాంటి భయం లేదని విమర్శించారు.
అయితే క్రిస్టియన్ మత పెద్దలు ఈ భూములకు సంబంధించి తక్కువ ధరకు కొని ప్రభుత్వంలోని పెద్దలతో కుమ్మక్కై ఎక్కువ ధరలకు అమ్మేయాలని చూస్తుంటారు. ఇలా చేయడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి పవన్ కల్యాణ్ క్షేత్ర స్థాయిలో పర్యటించడం ద్వారా రాష్ట్ర స్థాయిలో క్రిస్టియన్ భూములే కాదు ఎక్కడ ఏ ప్రాంతంలో భూములు కబ్జాకు గురయ్యాయి. ఏ రాజకీయ నాయకుడు అవినీతికి పాల్పడ్డారనే వివరాలు తెలుసుకోవచ్చు. ప్రజల ముందు ఉంచి తన సత్తా నిరూపించుకుని అధికారంలోకి రావచ్చు.