పాకిస్తాన్ ప్రధాని అంటే..జైలు జీవితం తప్పదా?
పాకిస్థాన్ లో కొన్ని వివాదాల్లో ఇరుక్కుపోవడం లేదా ఆ వివాదాల నుంచి బయటపడలేక జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఇది నిజమా కాదా అన్నది ఏదీ మంచిది ఏదీ చెడ్డది అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖైదీలుగా బతుకుతున్నారు పాక్ ప్రధానిలు. పదవిలో ఉన్నంత వరకు పాకిస్థాన్ లేదా లండన్ లో, లేదా జైల్లో బతుకుతున్నారు.
పాకిస్థాన్ అయిదో ప్రధానమంత్రిగా ఉన్న షాహిద్ ను జైల్లో పెట్టారు. మిలిటరీ పాలకుడిగా ఉన్న వ్యక్తికి మద్దతు పలకలేడని ఆయన జైలు శిక్ష అనుభవించారు. ఈయనను 1962 లో జైల్లో పెట్టారు. దేశ తొమ్మిదో ప్రధాని జుల్పిఖర్ బుట్టో ను అరెస్టు చేసి 1974 లో అరెస్టు చేసి 1979 లో ఉరికూడా తీశారు. దేశానికి ఏకైక ప్రధాని అయినా బెనజీర్ బుట్టో ను కూడా అరెస్టు చేశారు.
1985 లో హౌస్ అరెస్టు చేశారు. ఆమె శిక్షలను తప్పించుకోవడానికి విదేశాలకు వెళ్లి తల దాచుకున్నారు. 2007 లో తిరిగి వచ్చి ప్రచారం చేస్తుండగా రావల్పిండిలో బాంబు దాడిలో హత్య గాబడ్డారు. అనంతరం 1999లో ముషారఫ్ అధికారంలోకి వచ్చాక నవాజ్ షరీప్ అనే ప్రధానికి కూడా జైలు శిక్ష పడింది. ఇలా ఒక్కో వ్యక్తి ఒక్కో రకమైన వివిధ శిక్షలు అనుభవించారు. ప్రధాని అంటే ఒక జోకర్ లాగా తయారైంది పాకిస్థాన్‌లో. ఏ మాత్రం అధికారం కోల్పోతే చాలు ఏదో కేసులో ఇరికించడం జైలుకు పంపించడం సర్వ సాధారణమైపోయింది.