ఎల్లో మీడియా రచ్చ చేసినా.. ఆయన వెంటే జగన్‌?

Chakravarthi Kalyan
వైఎస్ వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, అతడి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రధాన నిందితులని తేలింది. అయితే ఎవరెన్నీ రకాలుగా చెప్పిన జగన్ మాత్రం వైఎస్ అవినాష్ రెడ్డిని మాత్రం దూరం చేసుకోవడం లేదు. గతంలో రాజకీయాల్లో అయితే చాలా మంది రాజకీయాలకు సంబంధించి ఎవైనా ఆరోపణలు వస్తే వాటి గురించి పట్టించుకుని చాలెంజ్ చేసి రాజీనామాలు సైతం చేసేవారు.

అయితే 16 నెలలు జైలులో ఉన్న జగన్ బయటకొచ్చి అధికారంలోకి వస్తాడని ఎవరూ కూడా ఊహించలేదు. కానీ ప్రజలకు ఆయనపై ఉన్న నమ్మకం, పాదయాత్ర గెలిపించాయి. ప్రస్తుత రాజకీయాల్లో తీవ్రమైన ఆరోపణలు చేయడం అలవాటైపోయింది. ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులపై లేనిపోని ఆరోపణలు, బట్ట కాల్చి మీద వేసేలా, బురద చల్లే కార్యక్రమాలను చేస్తున్నారు. దీని వల్ల అందరికీ సమాధానం చెప్పాలంటే అది సాధ్యం కానీ పరిస్థితి. అందుకే జగన్ పై ఎన్ని విమర్శలు చేస్తున్నా.. వాటిని పట్టించుకోవడం లేదు.

వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ టికెట్ తనకు రాకుండా వివేకా అడ్డుకుంటున్నాడని అవినాష్ చంపాడని సీబీఐ తేల్చి చెప్పడం, సుప్రీం కోర్టులో సవాల్ చేయడం, అనంతరం జరిగిన పరిణామాలతో సుప్రీంకోర్టు అరెస్టు చేయొద్దని చెప్పడం లాంటి అంశాలతో అవినాష్ రెడ్డి గురించి అందరికీ తెలిసిపోయింది. వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ అని మీడియా, పత్రికలు రాసుకొచ్చాయి.

అయినా కూడా వైఎస్ జగన్ అవినాష్ ను మాత్రం ఇంకా నమ్మినట్లే కనిపిస్తున్నాడు. అవినాష్ ఈ మధ్య తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులోకి వెళ్లి జగన్ ను కలిశారు. దీంతో వైఎస్ అవినాష్ ను జగనే కాపాడాలని ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జగన్, వైఎస్ అవినాష్ బంధం అంతగా బలంగా ఉండడానికి కారణం ఏమిటనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అవినాష్, జగన్ ను కలవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: