మోడీ కరుణించినా జగన్ ఒప్పుకోవట్లేదట?
అయితే కేంద్ర ప్రభుత్వం చేసిన పథకాలకు సంబంధించి చెప్పడం లేదు. ఏం చేయలేదో చెప్పే వారు ఎక్కువగా ఉన్నారు. కేంద్రం జల్ జీవన్ పథకంలో భాగంగా నిధులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తన గ్రాంట్ కేటాయించకపోవడంతో పథకంలో నిధులు వెనక్కి మళ్లిపోతున్నాయి. జల్ జీవన్ లో భాగంగా ఇంటింటికీ నల్లా పెట్టాలి. తాగునీటిని అందించాలి. కానీ ఏపీ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదు.
ఈ పథకం చేపట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు కేటాయించాల్సి వస్తుంది తప్పా ప్రజల నుంచి ఓట్లు పడవనే అభిప్రాయంలో ఉన్నారు. ప్రజలకు ఇప్పుడు కావాల్సింది కేవలం డబ్బులు ఇచ్చే పథకాలు. ఆ విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే ప్రజలకు డబ్బులిస్తే ఓట్లు వేస్తారనే విధంగా రాజకీయాలు చేసుకొచ్చారు. ఎలాంటి అభివృద్ధి పథకం ప్రవేశ పెట్టిన దాని వల్ల వచ్చే లాభం కన్నా ప్రజల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు పంపిస్తే వచ్చే ఓట్లనే చూస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఏ పథకంలో కూడా ప్రజలకు కావాల్సిన పథకాలకు నేరుగా డబ్బులు అందవు. అవి వారికి శాశ్వతంగా ఉపయోగపడేలా ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ విధంగా ఆలోచన చేయడం లేదు. అందుకే కేంద్రం పార్లమెంట్లో మాట్లాడుతూ.. ఏపీకి జల్ జీవన్ లో నిధులిచ్చినా కూడా వాటిని ఉపయోగించుకోలేరని చెప్పారు.