తెలంగాణ.. అంతా డ్రామాల రాజకీయమేనా?
దీంతో చంద్రబాబు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని విడిచిపెట్టి అమరావతికి అప్పటికప్పుడు వెళ్లిపోయేలా చేశారు. తర్వాత నయీం హత్య కేసు కూడా ఒక సంచలనం. నయీం ఎన్ కౌంటర్ అయిన తర్వాత అతడు చేసిన కబ్జాలు, ప్రజల నుంచి దోచుకున్న డబ్బులు ఏమయ్యాయి. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందా అంటే అదీ లేదు. రాజకీయంగా మాత్రం నయీం ఆగడాలను అడ్డుకునే వారు లేకుండా పోయారు.
కానీ ఇప్పుడు నయీం విషయంలో అదీ ఇదీ అని గొప్పలు చెప్పుకుంటారు. ఇలా లెక్కలేసుకుంటూ పోతే ఎన్నో అంశాలు తెగని పంచాయతీలుగా మారాయి. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ లో ఇంకా అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కేసు అంశం ఎప్పటికీ తేలుతుందో ఎవరికీ తెలియడం లేదు. టీఆర్ఎస్, బీజేపీలు ఇలాంటి వాటిపై ఎక్కువగా ప్రచారం చేసుకున్నాయి. పేపర్ లీకేజీలో రాజకీయ కోణం ఉందని ఇరుపార్టీలు దుమ్మెత్తిపోసుకున్నాయి.
రాజకీయంగా జనాల్ని రెచ్చగొట్టడానికి ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి తీసుకొచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తోందని బీఆర్ ఎస్ నాయకులు గగ్గోలు పెట్టారు. రోహిత్ రెడ్డి పది మంది సెక్యూరిటీని పెట్టుకుని వీడియోలు చేస్తుంటారు. ఈయన కాంగ్రెస్ తరఫున గెలిచి బీఆర్ఎస్ లో చేరి అవినీతి గురించి మాట్లాడతున్నారని విమర్శలు వచ్చాయి. ఓవరాల్ గా తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రాజకీయాలు మాత్రమే చేస్తూ చట్టపరంగా ప్రజలకు న్యాయం చేయడంలో విఫలమవుతున్నాయనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతోంది.