వ్యూహం ప్రకారమే పవన్‌ కల్యాణ్‌ కామెంట్స్‌?

Chakravarthi Kalyan
గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల  పర్యటనకు వచ్చినప్పుడు తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వమని  కోరారు. అలా జనసేన పార్టీని గెలిపిస్తే, తాను ముఖ్యమంత్రిని అయితే యువతకు ఉపాధి మార్గాన్ని చూపిస్తానని ఆయన చెప్పారు. అంతేకాకుండా మహిళలకు గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది. అలా అప్పుడు తాను గెలిస్తే ఏం చేస్తాను అనేది, అదేవిధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు గద్దె దించాలి అనేది కూడా ఆయన చెప్పుకొచ్చారు.


అయితే ఆయన ప్రసంగం విన్న తెలుగుదేశం పార్టీ వాళ్లు గానీ, మిగిలిన పార్టీ వాళ్లు గానీ  ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆయన స్పీచ్ విన్నాక చాలామంది అనుకున్నది ఏమిటంటే ఇక పవన్  ఒంటరిగా పోటీ చేయబోతున్నారు అని. అప్పుడు తెలుగు దేశం పార్టీ కూడ అదే విధంగా భావించిందని తెలుస్తుంది. అలాగే అప్పటివరకు బీజేపీతో కూడా కలిసి సాగుతామని చెప్పిన పవన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేసే సరికి అందరూ ఆశ్చర్యపోయారు.


పవన్ కళ్యాణ్ తనకు అధికారం ఇవ్వమని అడిగారు కానీ బిజెపినీ నన్ను కలిపి గెలిపించండి అని అడగలేదు. అలాగే తెలుగుదేశం పార్టీతో కూటమిగా ముందుకు వెళ్తామని కూడా ఆయన  అప్పుడు చెప్పలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ తెలుగుదేశంతో వెళ్ళాలో, భారతీయ జనతా పార్టీతో వెళ్ళాలో నిశ్చయించుకోలేదు.


ఒకవేళ జనసేన భారతీయ జనతా పార్టీని తీసుకుని తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలనుకున్నా తెలుగుదేశం ఇద్దరికీ గౌరవప్రదమైన సీట్లు అంటే 75 సీట్లు వరకు ఇవ్వడానికి రెడీగా లేదు. అయితే ఈ చర్చ మంచి కాక మీద  వెళ్తుంది అనే సందర్భంలో పవన్ కళ్యాణ్ తెలివిగా జనాల దృష్టిని మార్చేసినట్లుగా తెలుస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ వాలెంటీర్ల పైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విధంగా టాపిక్ వాలెంటైర్ల పైకి తీసుకు వెళ్లడం ద్వారా పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా టాపిక్ డైవర్ట్ చేశారని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: