వాలంటీర్ల రచ్చ.. జగన్‌కు ప్లస్.. పవన్‌కు మైనస్?
గతంలో కార్పొరేటర్, కౌన్సిలర్, ఎమ్మెల్యేల ఆఫీసుల చుట్టూ తిరిగితేనే పథకాలు ఇంటి దాకా వచ్చేవి. మళ్లీ ఆ పథకం లబ్ధి చేకూరాలంటే ఆ పార్టీ నాయకుడు మద్దతు కావాల్సి ఉండేది. కానీ వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత కార్పొరేటర్, కౌన్సిలర్, ఎమ్మెల్యేలు ఎవరి అవసరం లేదు. వాలంటీర్లే గడప గడపకు వెళ్లి వారికి ఏ పథకంలో ఏం రావాలి.. ఏదీ రాలేదు. ఎందుకు రాలేవని తెలుసుకుని లోపాలను సరిచేసి మరీ ఇంటింటికీ లబ్ధి చేకూర్చేలా చేస్తున్నారు.
దీంతో వాలంటీర్ల విషయంలో టీడీపీ ఎప్పుడో సైలెంట్ అయిపోయింది. కానీ పవన్ కల్యాణ్ మూడు రోజులు వాలంటీర్లపై తీవ్ర విమర్శలు చేశారు. పర్సనల్ డేటా దొంగిలిస్తున్నారని దాన్ని నానక్ రాంగూడలో అమ్మేస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్ల వ్యవస్థ వల్ల పర్సనల్ లైఫ్ ఇబ్బందిగా మారిందని అన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు పవన్ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
చివరకు మూడు రోజుల అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వాలంటీర్లు సోదర సమానులు, వారికి రూ. 10 వేల జీతం పెరగాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఇదే విషయం మూడు రోజుల ముందు అంటే రాష్ట్రంలోని వాలంటీర్లు అందరూ పవన్ కోసం పని చేసేవారు. ఆయనకు మద్దతుగా మాట్లాడేవారు. కానీ మూడు రోజులు అన్ని విమర్శలు చేశాక.. వాలంటీర్ల జీతాలు పెరగాలి.. వారు బాగుండాలని కోరుకుంటాను అని పవన్ మాట్లాడటంతో ఇదేదో ముందు మాట్లాడితే జనసేనకు కలిసొచ్చేది కదా అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.