80 ఏళ్ల వయసులో తోడు కోసం ప్రకటన.. పెళ్లికి ఒకే చెప్పిన అమ్మాయిలు.. చివర్లో ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

Amruth kumar
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కాలం లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది ఎవరికీ అర్థం కావట్లేదు . మనిషిని మోసం చేయటం అనేది ఇప్పుడు ఎంతో సులభంగా మారిపోయింది . అలాగే ఆన్లైన్ మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సోషల్ మీడియా వాడకం పెరిగిన దగ్గర నుంచి మనిషి మనిషిగా ఉండటం మర్చిపోయాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్లైన్లో మోసాల గురించి వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఓ వింత ఘటన చోటు చేసుకుంది. 80 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.. ఆ వృద్ధుడి కి పెళ్లి కూతుర్లు ఇచ్చిన షాక్ తో దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. దెళ‌రిటైర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా పని చేసిన చిన్న కొండయ్యకు భార్య 10 సంవత్సరాల క్రితం చనిపోయింది .

ఇక అతనికి సంతానం లేకపోవడం తో మధిరలోని జమాలపురంలో ఓ ఆశ్రమంలో ఉంటున్నాడు. తన ఆలనా పాలనా చూసేందుకు ఎవరూ లేరని కలత చెందిన చిన్న కొండయ్య వృద్ధుడైన అప్పటికీ కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు  పత్రికలో ప్రకటన కూడా ఇచ్చాడు. అది చూసి ఓ మ్యాట్రిమోనీకి చెందిన మహిళ అతన్ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంది. మ్యాట్రిమోనీకి చెందిన ఓ నిర్వాహకురాలితో పాటు సరస్వతి అనే మరో మహిళ చిన్న కొండయ్యను పెళ్లి చేసుకునేందుకు దిల్సుఖ్నగర్లోని ఓ లాడ్జికి వచ్చారు.

ఆ వృద్ధుడిని అక్కడకు రప్పించుకుని, పెళ్లి కోసం మాట్లాడుకున్నారు.ఈ క్రమంలోనే పెళ్లికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసేందుకు సికింద్రాబాద్లోని చందన బ్రదర్స్కు వచ్చి చిన్న కొండయ్య క్రెడిట్ కార్డుతో డబ్బులు డ్రా చేసి మంగళసూత్రం కొనుగోలు చేశారు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. రూ.లక్షా 77 వేలు క్రెడిట్ కార్డు నుంచి డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో కంగుతున్న చిన్న కొండయ్య, అనంతరం ఆ ఇరువురి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఇటువంటి ఉదంతాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: