ఎంత ఘోరం.. గజ ఈతగాడి దురాశ.. చివరికి ప్రాణం తీసింది?

praveen
ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగైపోతుంది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఏదైనా అపాయం వస్తేనే అయ్యో పాపం అంటూ జాలిపడేవాడు మనిషి. అంతేకాదు కుదిరితే సహాయం చేయడానికి కూడా సిద్ధపడేవారు. ఏకంగా కళ్ళ ముందు ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే అక్కడ ఉన్నది ఎవరో తెలియకపోయినా సహాయం చేసి ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నించేవారూ. కానీ ఇప్పుడు ప్రాణాలను కాపాడటం దేవుడు ఎరుగు.. ఏకంగా చిన్నచిన్న కారణాలకే సాటి మనుషుల ప్రాణాలను తీస్తున్న ఘటనలు అందరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి.

 సహాయం చేస్తే నాకేంటి ఉపయోగం అనే స్వార్థం ప్రతి ఒక్కరిలో కూడా నిండిపోయింది. దీంతో కళ్ళ ముందే ఒక వ్యక్తి ప్రాణాలు పోతున్నా కూడా ఏం పట్టనట్లుగా తమ పని తాము చేసుకుంటున్న పరిస్థితి నేటి సభ్య సమాజంలో కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసింది. ఇలా మనుషుల్లో వస్తున్న మార్పు సభ్య సమాజంలో మానవత్వం కనుమరుగయింది అన్నదానికి నిదర్శనంగా నిలుస్తుంది. అయితే ఇక్కడ జరిగిన ఘటన కూడా ఇలాంటి కోవకు చెందినదే అని చెప్పాలి.

 ఏకంగా గజ ఈత గాడి స్వార్థం, దురాశ ఏకంగా ఒక నిండు ప్రాణం బలి కావడానికి కారణమైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య వర్ధన్ తన మిత్రులందరితో కలిసి గంగానది నానామావ్ ఘాట్ వద్ద స్నానం చేసేందుకు వెళ్ళాడు. అయితే దురదృష్టవశాత్తు పొరపాటున నీటిలో పడిపోయాడు. అక్కడ ఉన్న అతని స్నేహితులు ఎవరికీ కూడా ఈత రాకపోవడంతో ఇక ఆ ప్రాంతంలోనే ఉన్న సునీల్ కశ్యప్ అనే గజ ఈతగాడిని సహాయం చేయాలని కోరారు. అయితే అతను రూ. 10,000 ఇస్తేనే నీటిలోకి దిగి కాపాడుతాను అంటూ దురాశకు పోయాడు. ఇక వారి దగ్గర క్యాష్ లేకపోవడంతో ఆన్లైన్లో అతనికి ట్రాన్స్ఫర్ చేసే లోపే చివరికి ఇలా నీటిలో పడిన ఆదిత్య వర్ధన్ ప్రాణాలు కోల్పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: