బొమ్మ అనుకుని పామును కొరికిన బాలుడు.. చివరికి?
సాధారణంగా ఏడాదిన్నర వయస్సు ఉన్న పిల్లాడు కనిపించిన ప్రతి వస్తువును తాకుతూ ఇక చిలిపి పనులు చేస్తూ ఆడుకుంటూ ఉండటం చూస్తూ ఉంటాం. అయితే ఇలాగే ఆడుకుంటున్న ఓ చిన్నారి దగ్గరికి పాము వచ్చింది. అయితే పాము కూడా తన దగ్గర ఉన్న బొమ్మల్లో లాగానే అది కూడా ఒక బొమ్మ అనుకున్నాడు. చివరికి ఆ పాముతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఆ పాము అతనిపై దాడి చేస్తున్న అతను మాత్రం ఆ పామును తన నోటితో కొరుకుతూ చివరికి ఆ పాము ప్రాణాలు తీసేసాడు. అయితే ఆ తర్వాత అక్కడ జరిగిన ఘటన గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి.
బీహార్ లోని గయాలో ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జమహర్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడాదిన్నర వయస్సు ఉన్న చిన్నారి ఇంటి టెర్రస్ పైన ఆడుకుంటున్నాడు. ఇందులో మూడు అడుగుల పొడవున్న ఒక పాము అటువైపుగా వచ్చింది. అయితే ఆ పామునూ కూడా ఆడుకునే బొమ్మ అనుకున్నాడు ఆ చిన్నారి. చివరికి ఆ పాము నడుము బాగాన్ని తన నోటితో పట్టుకుని నమలడం ప్రారంభించాడు. చివరికి ఆ పిల్లవాడి చేసిన పనికి ఆ పాము ప్రాణాలు వదిలింది. ఆ తర్వాత ఇది గమనించిన తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పామును వెంటనే ఇంటి బయట పడేసి వెంటనే ఆ చిన్నారిని తీసుకొని ఆసుపత్రికి పరుగులు పెట్టారు. అయితే ఆ పాము ఫోటోను చూసిన రైతులు అది విషపూరితమైన ప్రాము కాదని కాటు వేసిన ఏమి కాదని చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.