చార్జింగ్ కేబుల్.. బాలిక ప్రాణం తీసింది.. అసలేమైందంటే?

frame చార్జింగ్ కేబుల్.. బాలిక ప్రాణం తీసింది.. అసలేమైందంటే?

praveen
నేటి రోజుల్లో మొబైల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొబైల్ అనే మాయలో మునిగి తేలుతున్న మనిషి బయట ప్రపంచం గురించి అసలు పట్టించుకోవడం లేదు. అయితే నేటి టెక్నాలజీ యుగంలో కావాల్సినవన్నీ కూడా అరచేతిలో ఉన్న మొబైల్ లోనే దొరుకుతూ ఉండడంతో వాస్తవానికి మనిషికి బయట ప్రపంచంతో పని లేకుండా పోయింది. వేసుకునే చెప్పులు దగ్గర్నుంచి తినే ఆహారం వరకు ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటూ కూర్చున్న చోటికి తెప్పించుకోగలుగుతున్నాడు మనిషి. అయితే ఈ టెక్నాలజీ కారణంగా సామాన్యుడులా అన్ని కూర్చున్న చోటికి తెప్పించుకుని.. ఇక ఫిలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్పాలి.

 అయితే ఇలా మనిషికి అన్ని పనులను సులభతరం చేసేసిన మొబైల్ ఏకంగా కొన్ని కొన్ని సార్లు తట్టుకోలేని బాధను కూడా ఇస్తుంది. ఊహించని రీతిలో ప్రాణాలను తీసేసి ఇంట్లో విషాదం నింపుతుంది. ఇక ఇలాంటి తరహా ఘటనలను ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో మొబైల్ చార్జర్ల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఏకంగా చార్జింగ్ పెట్టి మొబైల్ మాట్లాడుతుండడం కారణంగా.. కరెంట్ షాక్ కొట్టి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొంతమంది ఇక మొబైల్ ఛార్జర్ ముట్టుకొని కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పాలి.

 అయితే ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. సెల్ఫోన్ ఛార్జింగ్ కు మరో చిన్నారి బలైంది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్తమద్దిపడగకు చెందిన ఏడాదిన్నర బాలిక ఆరాధ్య ఇంట్లోనే ఛార్జింగ్ కేబుల్ నోట్లో పెట్టుకోవడంతో విద్యుత్ షాక్ కి గురయింది. అయితే తల్లిదండ్రులు వెంటనే స్పందించి.. ఆమెను ఖానాపూర్ ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు బాలిక అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే అప్పటివరకు కళ్ళముందు ఆడుకుంటూ అనిపించిన తమ కూతురు.. ఇక లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక  అరణ్య రోదనగా విలపించారు తల్లిదండ్రులు. చార్జింగ్ కేబుల్ ను పిల్లలకు అందకుండా పెట్టాలని.. చార్జింగ్ పూర్తయిన తర్వాత వెంటనే సాకెట్ నుంచి తొలగించాలి అంటూ సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: