ఆపరేషన్ చేస్తుంటే చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు.. కానీ అంబులెన్స్ లో వెళ్తుంటే?
ఒకవైపు కనిపించని మహమ్మారి వైరస్ ప్రాణాలు తీస్తుందని తెలిసిన.. ఏకంగా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చికిత్స చేశారు. ఈ క్రమంలోనే వైద్యులు ఇంతటి సాహసం చేశారు కాబట్టే ఇక కరోనా వైరస్ కాలంలో కొంతమంది మాత్రమే మహమ్మారి వైరస్ బారిన పడి చనిపోయారు అని చెప్పాలి. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది. దీంతో కరోనా వైరస్ తర్వాత వైద్యులపై ఉన్న గౌరవం మరింత పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో కొంతమంది వైద్యులు మాత్రం ఆ వృత్తికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఇక ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.
ఏకంగా బతికుండగానే ఒక వ్యక్తికి డెత్ సర్టిఫికెట్ ఇచ్చేశారు డాక్టర్లు. ఇది ఏదో చిన్న ఆసుపత్రిలో అనుకునేరు. తెలంగాణలో ఎంతో పేరుగాంచిన నిమ్స్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. నిమ్స్ వైద్యులు చనిపోయాడని ఒక వ్యక్తికి డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే అతని బాడీని సొంత ఊరుకి తీసుకు వెళ్తుండగా ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. శ్రీను అనే వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం నిమ్స్ లో చేరాడు. అయితే శస్త్ర చికిత్స చేస్తుండగా అతను మరణించాడని వైద్యులు ప్రకటించి డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. దీంతో ఎంతో బాధతో కుటుంబ సభ్యులు అతన్ని అంబులెన్సులు స్వగ్రామానికి తీసుకు వెళ్తుండగా.. లేచి కూర్చున్నాడు. అయితే వైద్యులఫై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు వెంటనే సదరు వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.