
మహిళ సొంత వైద్యం.. పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంది.. కానీ చివరికి?
మామూలుగా అయితే జ్వరం జలుబు ఒలినొప్పులు వచ్చినప్పుడు ఇక డాక్టర్ను సంప్రదించకుండానే టాబ్లెట్స్ వేసుకోవడం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక మహిళ ఇలాగే చేసింది. కానీ చివరికి ఇలాంటి సొంత వైద్యంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంది. శరీరంలో నొప్పి రావడంతో ఇబు ప్రొఫైల్ మాత్ర వేసుకుంది. కానీ ఆసుపత్రి పాలయ్యింది. ఇరాన్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళకు వెన్నునొప్పి ఉంది. అయితే ఆమె వెంటనే ఇబు ప్రోఫైన్ మాత్రా వేసుకుంది ఆ మహిళ. డాక్టర్ను సంప్రదించకుండానే మాత్ర వేసుకోవడం చివరికి ఆమె పాలిట శాపం గా మారింది. టాబ్లెట్ వేసుకున్న కొద్దిగంటల్లోనే మహిళలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆమె కళ్ళు మొదట్లో ఎర్రగా మారడమే కాదు.. తర్వాత రక్తం రావడం మొదలైంది. ముఖం వాచిపోయింది పెదవులపై పసుపు రంగు మచ్చ కనిపించింది. చర్మం పాముల మారింది.
దీంతో ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా ఆమెను ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు వైద్యులు. కనీసం తిండి తినలేక నీరు తాగలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే వైద్యుల ప్రకారం ఇబు ప్రొఫైల్ మాత్రం హానికరం కాదు. వాపులు అలాగే నొప్పులకు ఉపయోగపడుతుంది. కానీ వైద్యులు సలహా లేకుండా తీసుకుంటే అది మరణానికి కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. శరీరాన్ని బట్టి మందులు వాడాలి అంటూ సూచిస్తున్నారు. వైద్యుల సలహా లేకుండా కనీసం తలనొప్పి టాబ్లెట్ కూడా వేసుకోకూడదు అంటూ సూచిస్తున్నారు.