కరోనా కంటే 100 రెట్లు ప్రమాదకరమైన వైరస్.. ముంచుకొస్తున్న ముప్పు?

praveen
కరోనా వైరస్.. ఈ పేరు వింటే చాలు ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈ ప్రాణాంతకమైన మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాల్లో అంతటి ప్రకంపనలు సృష్టించింది. సాఫిగా సాగిపోతున్న అందరి జీవితాలను తలకిందులు చేసింది. ఇక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితికి కారణమైంది. ఇంకెన్నో కుటుంబాలు విషాదం లో మునిగి పోయేలా చేసింది. ఏకంగా ప్రియమైన వారిని కోల్పోయి కుటుంబాలు అరణ్య రోదనగా విలపించే పరిస్థితులను తీసుకు వచ్చింది కరోనా వైరస్. కేవలం ఒక్క దేశం మాత్రమే కాదు ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఈ కనిపించని ప్రాణాంతకమైన వైరస్ తో పోరాటం చేశాయి.

 దీంతో కొన్నాళ్ల పాటు ప్రపంచం మొత్తం మాస్క్ అనే ముసుగు చాటుకు వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో అందరూ కరోనా వైరస్ పై పోరాటంలో విజయం సాధించగలిగారు. కానీ ఇప్పటికీ కూడా ఈ వైరస్ ప్రజలందరిని వేధిస్తూనే ఉంది అనే విషయం తెలిసిందే. అయితే ఇలా ప్రపంచ దేశాలలో కోవిడ్ సృష్టించిన కల్లోలాన్ని మర్చిపోకముందే.. కొత్త వైరస్ లు ఎప్పటికప్పుడు పుట్టుక వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో విపత్తు దూసుకు వస్తుంది అని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

 ప్రపంచాన్ని మొత్తం భయం గుప్పెట్లోకి నెట్టిన కరోనా వైరస్ కంటే 100 రేట్లు ప్రమాదకరంగా బర్డ్ ఫ్లూ విస్తరించే అవకాశం ఉంది అంటూ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. బర్డ్ ఫ్లూ వేరియంట్  h5n1 వైరస్ టెక్సాస్ లో కార్మికుడికి సోకి అతని ఆరోగ్యం విషమించి కళ్ళు ఎర్రగా మారిపోవడంతో ఐసోలేషన్ కు తరలించినట్లు చెప్పుకొచ్చారు.  అత్యంత ప్రమాదకరమైన ఈ బర్డ్ ఫ్లూ వేరియెంట్ మనుషులకు వ్యాపిస్తే కరోనా వైరస్ మరణాల కంటే ఇప్పుడు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: