సవతి తండ్రి నిర్వాకం.. కూతురి ముందే రోజు శృంగారం.. చివరికి ఓ రోజు?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే.. సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులు కాదు మనుషుల రూపంలో ఉండే మానవ మృగాలు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే అడవుల్లో ఉండే జంతువుల్లో అయినా మానవత్వం ఉంటుందేమో.. కానీ మనుషులు మాత్రం బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా సొంత వారి విషయంలోనే దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఆడపిల్లలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే బయట ఎవరైనా  ఆకతాయిలు వేధింపులకు పాల్పడితే ఇంట్లో తమ బాధలను చెప్పుకుంటూ ఉంటారు ఆడపిల్లలు.

 కానీ ఇక్కడ మాత్రం ఏకంగా టీనేజ్ లో ఉన్న కూతురు పైన సవతి తండ్రి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బయట వారితో శృంగారం కంటే ఇంట్లో వారితో శృంగారం సురక్షితం అనే మాయమాటలు చెప్పి చివరికి లైంగిక దాడి చేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన ఏకంగా అమెరికాలో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవలే బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సవతి తండ్రి, సొంత తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక బాధితురాలు వివరాల గోప్యత కోసం తల్లిదండ్రుల పేరును పోలీసులు బయటికి రానియ్యకుండా జాగ్రత్తపడ్డారు.

 అయితే దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి కూడా సవతి తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఈ విషయం ఆమె తల్లికి కూడా తెలిసినా ఎక్కడ తప్పు అని చెప్పలేదు అంటూ ఇక బాధితురాలు పోలీసులకు తెలిపారు. అయితే అపరిచితులతో లైంగిక కార్యకలాపాలు కొనసాగించాలని తమ కుమార్తె కోరుకుంటుందని ఇక ఈ విషయాన్ని తన భార్య తనకు తెలిపిందని.. ఆ సవతి తండ్రి పోలీసులకు తెలిపాడు. అపరిచితులతో లైంగిక కార్యకలాపాల కంటే ఇక తామే వాటిని బాధితురాలికి బోధించాలని అనుకున్నట్లు సమాధానం చెప్పాడు  సదరు సవతి తండ్రి. ఇక ఆ తర్వాత సెక్స్ టాయ్స్ తో ఇక కోరికలు ఎలా తీర్చుకోవాలో తమ కూతురికి చూపించామని.. మేము భార్యాభర్తలం శృంగారంలో పాల్గొంటే తమ కుమార్తె పక్కనే కూర్చొని చూసేది అంటూ సదరు సవతి తల్లి పోలీసులకు చెప్పిన విషయాలతో అందరూ షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: