మోసం చేయడంలో పీహెచ్డీ చేసినట్టున్నారు.. ఎందుకంటే?

praveen
ఏమయ్యా సుందరం.. మన సమాజంలో ఏం నడుస్తుంది.. ఇలా ఎవరినైనా అడిగాము అంటే.. ఏముంది ఎక్కడ చూసినా మోసాలే నడుస్తున్నాయి అనే సమాధానం ప్రతి ఒక్కరి నోటి నుండి వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేటి రోజుల్లో మోసాలు చేసి భారీగా దండుకోవాలని ఆలోచించే మనుషులు తప్ప ఉద్యోగమో వ్యాపారం చేసుకుని గౌరవంగా సభ్య సమాజంలో బ్రతకాలి అనే మనుషులు కాస్త తక్కువగానే కనిపిస్తున్నారు అని చెప్పాలి. అప్పుడెప్పుడో శ్రీశ్రీ చెప్పిన ఒక పదాన్ని తమకు నచ్చినట్టుగా తెగ వాడేసుకుంటున్నారు. అదేంటి శ్రీశ్రీ చెప్పిన విషయాన్ని వాడుకోవడమేంటి అనుకుంటున్నారు కదా.

 అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాకి పిల్ల కవితకి కాదేది అనర్హం అన్నారు శ్రీశ్రీ. అయితే నేటి రోజుల్లో కేటుగాళ్లు మాత్రం ఈ పదాన్ని తమకు నచ్చినట్టుగా వాడేసుకుంటున్నారు. మందు గోలి, లిక్కర్ బాటిల్, సగ్గుబియ్యం ఇలా మోసానికి కాదేది అనర్హం అన్న విధంగా బురిడీ కొట్టిస్తూ ఉన్నారు. ఇప్పటికే కల్తీగాళ్ళు రెచ్చిపోయి ఇక అన్ని విషయాలు కల్తీ చేస్తుంటే మరోవైపు కేటుగాళ్లు మాయమాటలతో నమ్మించి ప్రజలను బురిడీ కొట్టిస్తూనే ఉన్నారూ అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా నయ మోసం ఒకటి తెర మీదికి వచ్చింది. ఏకంగా వంద రూపాయల విలువ కూడా చేయని ముందును ఏకంగా మూడు లక్షలకు అమ్ముతున్నారు. అదేంటి ₹100 విలువ చేయని మందును ఎవరైనా మూడు లక్షలకు కొంటారా.. అలా కొన్నారు అంటే వారిని పిచ్చి వాళ్లే అనాలి అంటారు ఎవరైనా.

 నిజమే ఇలా పిచ్చివాళ్ల లాగానే ఇలా వంద రూపాయలు కూడా విలువ చేయని మందును మూడు లక్షలకు కొంటున్నారు. ఎందుకంటే కేటుగాళ్లు మాయమాటలతో అంతలా నమ్మిస్తున్నారు. ఢిల్లీలో ఇలా నకిలీ మెడికల్ రాకెట్ గుట్టును పోలీసులు చేదించారు. నకిలీ మందులు తయారు చేస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. ₹100 కూడా విలువ చేయని యాంటీ ఫంగల్ మెడిసిన్ ను ఖాళీ వయల్స్ లో నింపి క్యాన్సర్ మందు అంటూ మాయమాటలు చెప్పి విక్రయిస్తున్నారు. ఇందుకుగాను ఒక్కో సూదిని 3 లక్షల రూపాయలకు విక్రయించడం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏకంగా ఏడు వేలకు పైగా ఇంజక్షన్లను అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఇండియాలోనే కాదు చైనా, అమెరికాలకు కూడా ఈ మందులు ఎగుమతి చేసినట్లు విచారణలో తేల్చారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: