తల్లితో ఎఫైర్.. ఆమె కూతురిపై కన్ను.. చివరికి ఓ రోజు?
ఏకంగా క్షణకాల సుఖం కోసం ఎలాంటి నీచమైన పనులు చేయడానికి అయినా మనిషి సిద్ధమవుతున్న పరిస్థితి సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఎంతోమంది ఏకంగా కట్టుకున్న బంధాన్ని కాదని అక్రమ సంబంధాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇంకా ఇలాంటి ఘటనలు ఎన్నో దారుణాలకు కారణమవుతున్నాయ్. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఒక మహిళతో సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. కానీ ఇక అదే మహిళ కూతురు అయిన 13 ఏళ్ల బాలికపై కూడా అత్యాచారం చేశాడు ఆ నీచుడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది.
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏకంగా 13 ఏళ్ల బాలికపై సిద్దు అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాధితురాలు తల్లి గతంలోనే భర్తతో విడిపోయింది. అయితే ఆమెకు ముగ్గురు పిల్లలు ఉండగా.. ఇక తండ్రి వద్దనే ఉంటున్నారు. అయితే చంద్రశేఖర్ అలియాస్ సిద్దు అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడగా.. అతనితో సహజీవనం చేస్తుంది. ఇకపోతే ఇటీవలే తల్లిని కలిసేందుకు వచ్చిన 13 ఏళ్ల కూతురిపై కన్నేసాడు సిద్దు. ఇక బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకుని చివరికి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఇక జరిగిన విషయం బాలిక తండ్రికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.