తస్మాత్ జాగ్రత్త.. పిల్లలు ఎలా బస్ కింద పడ్డారో చూడండి?

praveen
సాతరణంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా తమ పిల్లలఫై ఒక కన్నేసి ఉంచాలి అనే విషయం తెలిసిందే. ఎందుకంటే చిన్న పిల్లలకు ఏది తప్పు ఏది ఒప్పు అన్న విషయం తెలియదు. ఇక ఏం చేస్తే ప్రమాదం ముంచుకొస్తుంది అన్న విషయం కూడా అర్థం కాదు. అందుకే ఇక చిన్న పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు ఎలాంటి వస్తువులను ముట్టుకుంటున్నారు అన్న విషయాన్ని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉండాలి తల్లిదండ్రులు. పిల్లల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన కూడా చివరికి ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలే దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది.

 ఇలా పిల్లలు ఆడుకుంటున్నారులే అని నిర్లక్ష్యంగా వదిలేసిన కారణంగా ఎంతో మంది ఇక ఇంటి బయటకు వెళ్లి వాహనాల కిందపడి చనిపోవడం లేదంటే ఇక వాటర్ హీటర్లో చేయి పెట్టి కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు ఇప్పటివరకు చాలామంది వెలుగులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే అని చెప్పాలి. ఏకంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు ఇద్దరు చిన్నారులు. కానీ బస్సు డ్రైవర్ వారిని గమనించలేదు. దీంతో ఏకంగా బస్సు ఆ ఇద్దరు చిన్నారుల పై నుంచి దూసుకుపోయింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది

 ముంబైలో ఈ ఘటన జరిగింది అని చెప్పాలి. సెయింట్ ఆగస్టిన్ హైస్కూల్ కు చెందిన బస్సు డ్రైవర్ రోడ్డు దాటుతున్న ఇద్దరి పిల్లలని గమనించలేదు. ఇక ఈ క్రమంలోనే బస్సునీ ముందుకు పోనిచ్చాడు. దీంతో ఇక బస్సు ముందుకు వచ్చిన ఇద్దరు పిల్లలపై కూడా బస్సు టైర్లు ఎక్కాయి. అయితే బస్సు ముందు టైరు ఆ ఇద్దరు చిన్నారుల పైనుంచి వెళ్లిన తర్వాత డ్రైవర్ బేకు వేసాడు. దీంతో బస్సు ఆపి డ్రైవర్ పరారయ్యాడు. కాగా బస్సు కింద పడిన నాలుగేళ్ల అమ్మాయి రెండేళ్ల అబ్బాయి తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సిసిటీవీలో రికార్డు కావడంతో ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. పిల్లల విషయంలో పేరెంట్స్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: