ఆటోలో వెళుతుండగా.. జీతం గురించి ప్రశ్నించిన భార్య.. భర్త ఏం చేశాడో తెలుసా?

praveen
భార్యాభర్తల బంధం కంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. కానీ నేటి రోజుల్లో మాత్రం ఇలా దాంపత్య బంధంలో అన్యోన్యత అనేది ఎక్కడ కనిపించడం లేదు. చిన్నచిన్న కారణాలతో ఏకంగా మనస్పర్ధలతో విడిపోతున్న భార్యాభర్తలు కనిపిస్తున్నారు తప్ప. ఎలాంటి సమస్య వచ్చిన సర్దుకుపోయి దాంపత్య బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించే భార్యాభర్తలు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. వెరసి ఇక పెళ్లయిన కొన్నాళ్లకే విడాకులు తీసుకొని వేరు పడుతున్న జంటలు నేటి రోజుల్లో ఎక్కువైపోయాయి.

 అయితే ఇలా విడాకులు తీసుకొని వేరుపడిన పర్వాలేదు. కానీ కొంతమంది అయితే ఏకంగా కట్టుకున్న వారిపైన కక్ష పెంచుకొని దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఏకంగా కడవరకు కష్టసుఖాల్లో  తోడు ఉంటాను అని ప్రమాణం చేసిన వారే చివరికి కట్టుకున్న వారిని దారుణంగా హత్య చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని అవ్వక్కయ్యేలా చేస్తున్నాయ్. పెళ్లి మీద ఉన్న భావనను మార్చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది.

 శాలరీ ఎందుకు తక్కువ వస్తుంది అని భార్య భర్తను ప్రశ్నించింది. ఇలా అడగడమే ఆమెకు శాపంగా మారిపోయింది. ఎందుకంటే భార్య ఇలా అడగడంతో ఏకంగా భర్త కనిపించకుండా పోయాడు  ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది  బాలాపూర్ ఎక్స్ రోడ్డుకు చెందిన ఇస్లావత్ రమేష్, మమతా భార్యాభర్తలు. అయితే శుక్రవారం రోజున రమేష్ జీతం డ్రా చేసేందుకు ఏటీఎం కు వెళ్లారు. ఇక ఆ తర్వాత ఆటోలో తిరిగి వస్తుండగా గత కొన్ని నెలల నుంచి జీతం ఎందుకు తక్కువ వస్తుంది అని ప్రశ్నించింది భార్య. దీంతో భర్తకు ఏమనిపించిందో తెలియదు కానీ.  వెంటనే ఆటో నుండి దిగి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు   ఇక కనిపించకుండా పోవడంతో షాక్ అయిన భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: