అయ్యబాబోయ్.. వాలెంటైన్స్ డేని కండోమ్స్ తో జరుపుకుంది?

praveen
వాలెంటెన్స్ డే వచ్చింది అంటే చాలు ప్రేమికులందరూ కూడా పండగ వాతావరణం వచ్చేసింది అని నమ్ముతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే వాలంటైన్స్ డే ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అప్పటికే ప్రేమలోకి మునిగి తేలుతున్న వారు ఇక వాలెంటైన్స్ డే కొన్ని రోజుల ముందు నుంచి కూడా ఇక ప్రతిరోజు ప్రియమైన వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఒకరి ప్రేమను ఒకరు వ్యక్తపరచుకోకుండా ఉన్నవారు. వాలెంటెన్స్ డే రోజున తమ మనసులోని భావాలను ప్రియమైన వారికి చెప్పాలని అనుకుంటూ ఉంటారు.

 అయితే ఇలా వాలెంటెన్స్ డే రోజుని ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కొంతమంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు మాత్రం ఈ ప్రేమికుల రోజున కూడా తమ సబ్స్క్రైబర్లను పెంచుకోవడానికి వినూత్నమైన రీతిలో జరుపుకోవడం చేస్తూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి వింతైన విచిత్రమైన సెలబ్రేషన్స్ గురించె. ఎవరు కూడా కలలో సైతం ఇలాంటి వాలెంటెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవాలని అనుకోరేమో అని అనిపిస్తూ ఉంటుంది ఇందుకు సంబంధించిన విషయం చూస్తూ ఉంటే. ఏకంగా కండోమ్స్ తో ఆమె వాలెంటెన్స్ డే జరుపుకుంది.  కండోమ్స్ తో వాలెంటైన్స్ డే జరుపుకోవడం ఏంటి వినడానికే విచిత్రంగా అనిపిస్తుంది అనుకుంటున్నారు కదా.

 కానీ అమెరికాకు చెందిన పాపులర్ యూట్యూబర్ ఇలాగే ప్రేమికుల రోజు సెలబ్రేషన్స్ జరుపుకొంది. ఆలీ స్పాక్నోలా అనే యూట్యూబర్ వాలంటీర్స్ డే ని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంది. ఆర్ట్ గ్యాలరీని ఏకంగా 500 కాండోమ్స్ తో నింపేసింది. ఆమె ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇక ఆ కండోమ్స్ అన్నింటినీ కూడా ఏకంగా బెలున్స్ లాగా గాలి నింపి తయారు చేసింది. అయితే వాటిని గాలితో నింపేందుకు మూడు రోజులు పట్టింది అంటూ సదరు యూట్యూబర్ తెలిపింది. కాగా దానిపై చాలామంది సానుకూలంగా స్పందిస్తున్నారు. అయితే ఆమె పోస్ట్ చేసిన వీడియోకి భారీగానే వ్యూస్ వచ్చాయి అని చెప్పాలి. కాగా ఈమెకు యూట్యూబ్లో 1. 89 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: