జైల్లో ఖైదీలకు ఎయిడ్స్.. దీని వెనుక అసలు కారణం ఇదే?

praveen
సాధారణం గా ఏదైనా నేరం చేసి జైలుకు వెళ్లిన ఖైదీ ఇక సభ్య సమాజానికి పూర్తిగా దూరంగా ఉంటాడు అన్న విషయం తెలిసిందే. నాలుగు గోడల మధ్య జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక జైల్లో ఏదో ఒక పని చేసుకోవడం.. జైల్లో పెట్టిన ఆహారాన్ని తిని బతకడం లాంటివి చేస్తూ ఉంటారు ఖైదీలు. అయితే  ఇలా సభ్య సమాజం తో ఎలాంటి సంబంధాలు లేని ఖైదీకి ఎయిడ్స్ అనే వ్యాధి సోకింది అంటే ఎవరైనా నమ్ముతారా.. అసలు జైల్లో ఉంటూ మహిళలతో సంభోగానికి దూరంగా ఉన్న వ్యక్తికి ఎయిడ్స్ ఎలా సంక్రమిస్తుంది అని రైతుల ప్రశ్నిస్తారు ఎవరైనా.

 కానీ ఇటీవల కాలం లో మాత్రం జైళ్లలో దారుణ మైన పరిస్థితులు ఉన్నాయి అన్న దానికి సంబంధించి ఇటీవల వెలుగు లోకి వచ్చిన ఘటన నిదర్శనంగా మారి పోయింది అని చెప్పాలి. ఏకంగా జైల్లో శిక్షణ అనుభవిస్తూ దీర్ఘకాలం గా సంభోగానికి దూరంగా ఉన్నవారు. ఇక జైల్లోనే మిగతా మగ ఖైదీలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు అన్న విషయం ఇటీవల విచారణ లో తేలింది. ఎందుకంటే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఎయిడ్స్ బారిన పడటం సంచలనంగా మారి పోయింది అని చెప్పాలి.

 లక్నో జైల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల కొంతమంది ఖైదీలకు ఎయిడ్స్ టెస్టులు చేయగా.. ఏకంగా పదిమంది ఖైదీలు ఎయిడ్స్ బారిన పడ్డారు అన్న విషయం తేలింది. దీంతో అధికారులు ఒక్కసారిగా  మిగతా ఖైదీలు అందరికీ కూడా టెస్టులు నిర్వహించారు. అయితే ఈ టెస్టుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. మొత్తంగా జైల్లో శిక్షను అనుభవిస్తున్న 48 మంది ఖైదీలు.. ఇక ఎయిడ్స్ బారిన పడ్డారట. దీంతో జైల్లో  ఉన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం అవుతూ ఉండగా.. అన్ని జైలళ్లలో ఇలాంటి పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: