యూట్యూబ్ లో చూసి గేదెను కొనాలనుకున్నాడు.. కానీ చివరికి?

praveen
నేటి రోజుల్లో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ మనిషి జీవనశైలిలో ఎన్ని మార్పులు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని సామాన్యుడు సైతం సంపన్నుడిలా జీవితము గడిపే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు సంపన్నులు మాత్రమే పని వాళ్ళని పెట్టుకుని కావాల్సింది కూర్చున్న చోటుకు తెప్పించుకునే వాళ్ళు.. కానీ ఇప్పుడు సామాన్యుడు సైతం అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ లో ఒక క్లిక్ ఇచ్చి కావాల్సినవన్నీ కూడా కూర్చున్న చోటికి తెప్పించుకోగలుగుతున్నాడు.

 ఇలా అందుబాటులోకి వచ్చిన వినూత్నమైన టెక్నాలజీ ఏకంగా సామాన్యుడికి సైతం విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వగలుగుతుంది అని చెప్పాలి  దీంతో వేసుకునే చెప్పుల దగ్గర నుంచి ఏకంగా తినే ఆహారం వరకు ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేయడానికి బాగా అలవాటు పడిపోతున్నాడు మనిషి. అయితే ఇక ఇలాంటి టెక్నాలజీ మీద అవసరానికి మించి ఆధారపడటం.. కూడా కొన్ని కొన్ని సార్లు చేదు అనుభవాలను మిగులుతూ ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తికి ఇలాంటి అనుభవం ఎదురయింది.

 కేవలం ఆన్లైన్ యాప్ లో మాత్రమే కాదు యూట్యూబ్లో కూడా ఇలాంటి ఆర్డర్లు చేయడం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం. కాగా ఇటీవల కాలంలో  యూట్యూబ్ రూపంలో ఇక ఎంతోమందికి భారీగా ఆదాయం అందిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇంకొంతమందికి యూట్యూబ్ తెలియని విషయాలను కూడా తెలిసేలా చేస్తుంది. అయితే ఇటీవల ఒక వ్యక్తి యూట్యూబ్లో వీడియో చూసి గేదని కొందామని మోసపోయాడు. గేదెను అమ్ముతానంటూ శుభం అనే వ్యక్తి యూట్యూబ్లో వీడియో పెట్టాడు. అయితే యూపీలోని రాయ్ భరేలికి చెందిన పాడి రైతు సునీల్ 55000 కొనేందుకు ఫోన్లో మాట్లాడాడు. అయితే 10,000 అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. కాగా గేద యజమాని శుభం ఆ గేదెను ఇవ్వకపోగా.. మరో 25 వేలు ఇవ్వాలి అంటే అడిగాడు. దీంతో మోసపోయానని గ్రహించిన సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: