"దృశ్యం" రిపీట్‌: బీమా సొమ్ము కోసం భలే డ్రామా?

Chakravarthi Kalyan
అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. వాటిని తీర్చడానికి తాను చనిపోయినట్లు ఓ సినిమా తీసేంత స్థాయిలో స్కెచ్ వేశాడు. బీమా సొమ్ము కోసం చనిపోయినట్లు నమ్మించాలని అనుకున్నాడు. పథకం బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా దొరికాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో జనవరి 26న గుర్తు తెలియన వ్యక్తి మృతి కేసులో మిస్టరీ ని పోలీసులు చేధించారు.

కేతమల్ల వెంకటేశ్వరరావు(పూసయ్య) వీరంపాలెంలో ధాన్యం వ్యాపారి. వివిధ అవసరాలకు తీర్చలేని అప్పులు రచించాడు. దీని కోసం ఓ ప్లాన్ రచించాడు. చనిపోయినట్లు చిత్రీకరించుకొని కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్తే తన పేరిట రూ.40లక్షల బీమా సొమ్ము వస్తుందని భావించాడు. ప్రమాదవశాత్తూ మరణించినట్లు నమ్మించడానికి ప్రణాళిక రూపొందించాడు. అతని స్థానంలో వేరొక మృత దేహాన్ని ఉంచి ఎవరూ గుర్తించకుండా చేయాలని భావించాడు.

ఈ తర్వాత గుర్తు తెలియని మృతదేహం కోసం రాజమహేంద్రవరం మోరంపూడికి చెందిన ఇద్దరు యువకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పాత బొమ్మూరులో జనవరి 23న ఒఎన్జీసీ ఇంజినీర్ నెల్లి విజయరాజు(53) మరణించాడు. కుటుంబీకులు మరుసటి రోజే శవాన్ని పూడ్చి పెట్టారు. విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులు ఆ శవాన్ని జనవరి 25న అపహరించి వీరయ్య చెప్పిన ప్రకారం దాన్ని వీరంపాలెం తీసుకెళ్లి ఓ పొలంలో ట్రాన్స్ ఫార్మర్ వద్ద పెట్రోల్ పోసి తగలబెట్టారు. పూసయ్య పాదరక్షలు, సెల్ ఫోన్ అక్కడే విడిచి పరారయ్యారు.

ఇక ఆధారాలను బట్టి మృతదేహం పూసయ్యదేనని గ్రామస్థులు భావించి పోస్టుమార్టం కోసం తరలించారు. భర్త మరణాన్ని తట్టుకోలేని ఈయన భార్య తాను చనిపోతానంటూ కన్నీరు మున్నీరైంది. ఇక్కడ జరిగే విషయాలను ఆ ఇద్దరు యువకులు అజ్ఞాతంలో ఉండి ఎప్పటికప్పుడు ఆయనకు వివరించారు. ఇక భార్య బాధను చూడలేక ఆమెకు ఎలాగైనా అసలు విషయాన్ని చెప్పాలని భావించి పూసయ్య మరో కొత్త స్కెచ్ వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో పొలంలో మృతదేహం కాలుస్తుండగా తాను అడ్డుకున్నానని , దీంతో వారు తనను కొట్టి ఆటోలో తీసుకెళ్లారని.. ఆ తర్వాత తుప్పల్లో పడేశారని చెప్పుకొచ్చారు. కానీ అతని శరీరంపై గాయాలు లేకపోవడంతో అనుమానాలకు తావిచ్చింది. పోలీసులుతమ దైన శైలిలో విచారించగా అసలు విషయం బయట పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: