తియ్యగా మాట్లాడింది.. ఫోన్ నెంబర్ తీసుకుంది.. చివరికి ఓ రోజు ఇంటికి వెళ్లి?

praveen
నేటి సభ్య సమాజంలో ఉన్న మనుషులను చూస్తూ ఉంటే మోసం చేయడమే వారి నైజం ఏమో అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే ఎదుటివారిని మాయమాటలతో బురిడీ కొట్టించి మోసం చేసి ఇక డబ్బులు దండుకోవాలి అని ఆలోచిస్తున్న వారు తప్ప నిజాయితీగా ఉండాలి అని ఆలోచిస్తున్న మనుషులు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేదు ఇక అందరూ కూడా ఇలా  అమాయకులను వలలో వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి.

 ఇక్కడ ఒక యువతి ఇలాంటిదే చేసింది. ఏకంగా వలపు వల విసిరి ఒక వృద్ధుడిని మాయమాటలతో బుట్టలో వేసుకుంది. అయితే తీయ్యగా మాట్లాడటంతో ఆ యువతీ నిజంగానే ప్రేమ చూపిస్తుంది అని ఆ వృద్ధుడు అనుకున్నాడు. నా వయసుకు ఆ అమ్మాయితో ప్రేమ ఏంటి అని వెనక ముందు కూడా ఆలోచించలేదు.  చివరికి అమ్మాయి మాయలో నిండా మునిగిపోయి రెండు తులాల బంగారం పోగొట్టుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది ఈ కేసులో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రెండు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.

 మేడ్చల్ కు చెందిన 36 ఏళ్ళ శిరీష ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఉన్నిసా బేగం అలియాస్ సమీనా బ్యూటీషియన్ లుగా పనిచేస్తున్నారు. బుద్ధిగా  పని చేసుకునీ బ్రతకడం మానేసి సులభంగా డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచించి ఒక చెత్త ప్లాన్ వేశారు  ఈ నాగోల్ లోని మత్తుగూడా సమీపంలో హోటల్లో ఉండే ఒక వృద్ధుడిని పరిచయం చేసుకున్నారు. తీయ్యగా మాట్లాడి అతని మొబైల్ నెంబర్ తీసుకున్నారు. తరచూ ఫోన్లో మాట్లాడేవారు. ప్రేమ నిజమే అనుకున్నాడు వృద్ధుడు . ఇక ఓ రోజు ఆ మహిళలను వృద్ధుడు ఇంట్లోకి రమ్మనగా వాళ్లు వెళ్లారు. ఇక వృద్ధుడిని మాటల్లో పెట్టి మెడలో నుంచి రెండు బంగారు గొలుసులు లాక్కొని పారిపోయారు. దీంతో వెంటనే వృద్ధుడు షాక్ అయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: