నాకున్న చివరి ఆప్షన్ ఇదే.. సూసైడ్ నోట్ చూసి పేరెంట్స్ గుండె పగిలింది?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే సభ్య సమాజంలో మనుషుల్లో విచక్షణ జ్ఞానం అనేది పూర్తిగా కనుమరుగైపోతుందేమో అనే భావన ప్రతి ఒక్కరు కూడా కలుగుతుంది. ఎందుకంటే చిన్నచిన్న కారణాలకే అక్కడితో జీవిత ముగిసిపోయింది అని భావిస్తూ చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని కొంతమంది తల్లిదండ్రులు మందలించారని.. ఇంకొంతమంది స్కూలు లేదా కాలేజీలో స్నేహితులు హేళన చేశారని.. మరి కొంతమంది ఇలాంటి చిన్న చిన్న కారణాలతోనే కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు ఎంతోమంది విద్యార్థులు.

 ఈ క్రమంలోనే తమ మీదే ఆశలు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుతున్న తల్లిదండ్రుల గురించి ఒక్క నిమిషమైనా ఆలోచించడం లేదు. వెరసి క్షణికావేషంలో నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు కడుపుకోతనే మిగులుస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఎందుకో మనుషుల్లో ఆలోచించే విచక్షణ జ్ఞానం అనేది పూర్తిగా తగ్గిపోయింది ఏమో అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కొవలోకి చెందినదే. జెఈఈ మెయిన్స్ కి సిద్ధమవుతున్న ఓ విద్యార్థిని చివరికి ఆత్మహత్య చేసుకుంది.

 రాజస్థాన్లో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. పరీక్షల ఒత్తిడితో కోటాలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. జనవరి 31న జేఈఈ పరీక్ష ఉండగా.  ఇక గదిలో ఉరి వేసుకుంది విద్యార్థిని  అమ్మానాన్న నేను జేఈఈ చదవలేక పోతున్నా.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. నేను ఒక లూసర్ ను చాలా వరస్ట్ కూతురిని. అమ్మ నాన్న నన్ను క్షమించండి. నాకున్న చివరి ఆప్షన్ ఇదే అని ఒక సూసైడ్ నోట్ రాసి చివరికి ఆత్మహత్య చేసుకుంది. కాగా సదురు విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కూతురి మరణ వార్త తల్లిదండ్రుల గుండె పగిలేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: