ఒక్క క్షణం ఆలస్యమైనా.. ఆ చిన్నారి నుజ్జు నుజ్జు అయ్యేది?

praveen
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు  సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాంటి వీడియోలలో కొన్ని ఏకంగా గగుర్పాటుకు గురి చేస్తూ ఉంటాయి. రెప్పపాటు కాలంలో ఏకంగా అప్పటివరకు ఆనందంగా గడిపిన వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు అదే క్షణ  కాలంలో ఏకంగా ప్రాణాలు పోయే ప్రమాదం నుంచి కొంత మంది బయటపడుతూ ఉంటారు.

 ఇక ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు చూసినప్పుడు ఏకంగా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. సాధారణంగా తల్లిదండ్రులు ఇక పిల్లలను ఎప్పటికప్పుడు సంరక్షించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే పిల్లల రక్షణ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి పిల్లలను కాపాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక తండ్రి ఇలాగే రెప్పపాటు కాలంలో తన చిన్నారి కూతురుని కాపాడాడు.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఓ తండ్రి తన బిడ్డను బైక్ ఫై కూర్చోబెట్టి తాను పక్కనే నిలబడ్డాడు. అయితే బైక్ రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉంది. ఇక అదే సమయంలో ఒక వైపు నుంచి కారు ఎంతో వేగంగా దూసుకొచ్చింది. తండ్రి కార్ ను చూసి ఒక్కసారిగా అప్రమత్తమయ్యాడు. రెప్పపాటు కాలంలో బైక్ మీద కూర్చోబెట్టిన కూతురిని.. చేతిలోకి తీసుకొని పక్కకు లాగేస్తాడు. మరుక్షణమే ఆ కారు ఆ బైక్ ను బలంగా ఢీ కొట్టింది. బైక్ ఈ ఘటనలో ధ్వంసం అయింది. తండ్రి స్పందించకపోయి ఉంటే రెప్ప పాటు కాలంలో ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vir

సంబంధిత వార్తలు: