యముడు లీవ్ లో ఉన్నట్టున్నాడు.. అందుకే అతను బ్రతికేసాడు?

praveen
సామాన్యుల దగ్గర నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరు కూడా సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు బాగా ఇష్టపడే ప్రయాణ మార్గం రైలు మార్గం. ప్రతిరోజు కోట్లాదిమంది ప్రయాణికులు ఈ రైలు మార్గం ద్వారా ఇక ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. అతి తక్కువ ఖర్చుతోనే సుదూర ప్రాంతాలకు వెళ్ళవచ్చు. అందుకే ఎక్కువ మంది రైలు ప్రయాణాలని ఇష్టపడుతూ ఉంటారు. అది సరే కానీ ఇప్పుడు రైలు ప్రయాణాల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారు కదా.

 అయితే సాధారణంగా రైలు ప్రయాణాలు చేసే వారు సాఫీగా రైలు ఎక్కి ప్రయాణిస్తే పర్వాలేదు. కానీ కొంతమంది రైల్ ఎక్కిన తర్వాత చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. ఏకంగా రైలు డోర్ దగ్గర వేలాడటం చేస్తారు. ఇంకొంతమంది ఏకంగా రైలు మీదకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటివి చేసి ఏకంగా ప్రాణాలను రిస్కులో పెట్టుకుంటారు చాలామంది. ఇంకొంతమంది అయితే చివరికి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిసిన తర్వాత   యమధర్మరాజు పాపం లీవ్ లో ఉన్నట్టున్నాడు  అందుకే ఆ యువకుడు బ్రతికి పోయాడు అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 ఇంతకీ ఏం జరిగిందంటే.. అందరిలాగానే ఒక యువకుడు రైలు ఎక్కాడు. కానీ రైల్ ఎక్కిన తర్వాత అతనికి పిచ్చి ఆలోచన వచ్చింది. దీంతో కిటికీలోనుంచి తల బయటికి పెట్టి విన్యాసాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే ఇక అదే రైలులో ఉన్న మరో యువకుడు అతని వారించడం మానేసి వీడియో తీస్తున్నాడు. కాగా యువకుడు చివరికి రైలు మీదికి ఎక్కి చివరికి కరెంట్ షాక్ తగిలి ఒక్కసారిగా కుప్పకూలడు. అయితే ఇక హై టెన్షన్ వైర్లను తాగితే ఒక్కసారిగా ప్రాణాలు పోతాయి. కానీ అతను మాత్రం గాయాలతో బతికి బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: