అక్కా అంటూ దగ్గరయ్యాడు.. కానీ ఓ రోజు?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్య సమాజంలో బ్రతుకుతున్న మనుషులా లేకపోతే మనుషుల రూపంలో మానవ మృగాల అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే నేటి రోజుల్లో మనుషుల్లో జాలి దయ అనే గుణం ఎవరిలో కనిపించటం లేదు. ఏకంగా కామంతో కళ్ళు మూసుకుపోతున్న మృగాలు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్ల కంటి ముందు కనిపించింది అంటే చాలు మగాళ్లలోని మృగాలు బయటికి వస్తే..  దారుణంగా అత్యాచారాలు చేస్తున్న ఘటనలు వెలుగులుకి వస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఏకంగా సొంతింట్లోనే ఆడపిల్లకు లైంగిక వేధింపులు ఎదురవుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయ్.

 అయితే అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టలు తీసుకువచ్చినప్పటికీ కామాంధుల తీరులో మాత్రం అస్సలు మార్పు రావడం లేదు. అయితే ఇటీవల కేరళలో ఏకంగా స్కూల్ టీచర్ ని దారుణంగా దాడి చేసి గాయపరచడమే కాదు ఇక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనంగా మారిపోయింది. రోజులాగే స్కూల్ కి వెళ్ళిన టీచర్ సాయంత్రం తిరిగి రాకపోవడంతో ఆమె భర్త కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు టీచర్ శవమై లభించింది.

 ఈ క్రమంలోనే క్లూస్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నందిని అనే మహిళలకు రీల్స్ చేయడం అలవాటు. అయితే రీల్స్ చేయడం మానుకోవాలని నందిని భర్త లోకేషన్ ఎన్నోసార్లు హెచ్చరించిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆయన సైలెంట్ గానే ఉండిపోయారు. అయితే నందిని మేలుకోటకు చెందిన నితీష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అక్క అంటూ ఆత్మీయంగా పలకరించేవాడు. నందిని హత్య తర్వాత నితీష్ కనిపించకుండా పోయాడు. పరారీలో ఉన్న అతని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అతను అసలు నిజం చెప్పేశాడు. మధ్యాహ్నం స్కూల్ నుంచి వస్తున్న నందిని మార్గమధ్యంలో కనిపించడంతో.. బండి ఎక్కించుకొని ఓ నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి దాడి చేసి హత్య చేశాడు. అక్క అంటూ పిలుస్తూనే చెడు దృష్టితో చూడటం మొదలుపెట్టిన నితీష్. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆమె ఎన్నోసార్లు హెచ్చరించిన తీరు మార్చుకోలేదు.  ఈ విషయం ఎక్కడ బయట పడుతుందో అని హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: