AI సాయంతో.. మృతదేహం కళ్ళు తెరిపించిన పోలీసులు.. చివరికి?

praveen
నేటి రోజుల్లో టెక్నాలజీ రాజ్యమేలుతుంది. టెక్నాలజీ మీద అవగాహన ఉన్నోడే ప్రతి పనిని కూడా సులభతరం చేసుకుంటున్నాడు. అంతేకాదు ఇక ఎప్పటికప్పుడు  టెక్నాలజీతో కూడిన వినూత్నమైన ఆవిష్కరణలు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. ఒకప్పుడు మనుషులు చేసే అన్ని పనులన్ని ఇక ఇప్పుడు టెక్నాలజీతో తయారుచేసిన మిషన్ చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక మనిషి జీవనశైలిలో అటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్స్ అనూహ్యమైన మార్పులకు కారణం అవుతుంది అని ఎంతోమంది నిపుణులు కూడా చెబుతూనే ఉన్నారు.

 అయితే కేవలం సాధారణ జనాలకు మాత్రమే కాదు పోలీసులకు కూడా ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక టెక్నాలజీని ఉపయోగించుకొని కేసులను ఎంతో సులభంగా పరిష్కరించగలుగుతున్నారు అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఎన్నో రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ టెక్నాలజీ సంచలన మార్పులకు కారణం అవుతుంది. అయితే ఇటీవల ఢిల్లీ పోలీసులు ఇలాంటి టెక్నాలజీ సహాయంతోనే ఒక కేసును ఎంతో సులభంగా పరిష్కరించారు. ఏకంగా కళ్ళు మూసి ఉన్న మృతదేహం ని కళ్ళు తెరిచేలా చేసి చివరికి నేరస్తులను పట్టుకున్నారు.

 ఉత్తర ఢిల్లీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  స్థానిక గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద ఓ యువకుడు మృతదేహం లభ్యమయింది. అయితే సమాచారం అందుకున్న చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరో అతన్ని గొంతు నులిమి చంపినట్లు గుర్తించారు. అయితే నేరస్తులను పట్టుకోవడం మాత్రం వారికి సాధ్యం కాలేదు. ఎందుకంటే ఎలాంటి క్లూ దొరకలేదు. ఇలాంటి సమయంలోనే టెక్నాలజీ సహాయంతో ముందుగా మృతదేహం కళ్ళు తెరిచినట్లు చేశారు. సదరు వ్యక్తి ప్రాంతంలో నిలబడి ఫోటో తీసుకున్నట్లుగా క్రియేట్ చేశారు. ఇక తర్వాత ఫోటోలను ప్రింట్ చేయించి నగరంలోని వివిధ ప్రాంతాల్లో అంటించారు. అలాగే అన్ని పోలీస్ స్టేషన్ల తో పాటు వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. చివరికి యువకుడుని కుటుంబ సభ్యులు గుర్తుపట్టి.. పోలీసులని సంప్రదించారు. దీంతో చనిపోయింది హితేంద్ర అని తెలుసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ముగ్గురు యువకులతో జరిగిన గొడవ కారణంగానే వారు హితేంద్రను హత్య చేశారని తేలింది. చివరికి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: