కొడుకు కొత్త బట్టలు కొనివ్వలేదని.. తండ్రి ఏం చేశాడో తెలుసా?

praveen
నేటి ఆధునిక సమాజం లో మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీకి అనుగుణంbగా తనను తాను మార్చుకోవడానికి ఇష్ట పడుతూ వున్నాడు మనిషి. ఈ క్రమం లోనే  ప్రతి విషయం లో కూడా సరి కొత్తగా ఆలోచిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. కానీ ఎందుకో నేటి ఆధునిక యుగంnలో మనిషిలో విచక్షణ జ్ఞానం అనేది రోజు రోజుకు తగ్గి పోతుందేమో అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. అయితే ఇలా అనిపించడానికి కారణం కూడా లేక పోలేదు. నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్న ఘటనలే ఇందుకు కారణం.

 ఒకప్పుడు ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా నిలబడి ఎదుర్కొనేవాడు మనిషి. కానీ ఇప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కారం ఒక్కటే ఆత్మహత్య అనే విధంగా మనిషి ఆలోచన తీరు మా lరిపోయింది అన్నదానికి నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్న ఘటన నిదర్శనం గా మారి  పోతున్నాయి. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చిన.. తల్లిదండ్రులు మందలించిన లేదంటే స్నేహితులb తో గొడవ జరిగిన ఇలా ప్రతి దానికి కూడా ఆత్మహత్య ఒక్కటే కారణమనీ ఆలోచిస్తున్నారు.

 దీంతో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగానే ముగించుకుంటున్నారు ఎంతోమంది. అయితే కొంత మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలు తెలిసి ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ లో ఇలాంటి ఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధి లోని అమీన్పూర్లో ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన రమణయ్య కొడుకు మహేష్ తో కలిసి ఉంటున్నాడు. కొడుకు పుట్టినరోజు సందర్భం గా బట్టలు కొనివ్వాలని తండ్రి కోరాడు. కానీ ఇదే విషయం పై తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన రమణయ్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: