5గురి ప్రాణాలు పోయాయి.. చలికాలంలో మీరు మాత్రం ఇలా చేయకండి?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే మనిషి ప్రాణం ఎప్పుడూ ఎలా పోతుందో కూడా చెప్పలేని విధంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే అంత సాఫీగాని సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలతో ఇక ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవలే కాలంలో సడన్ హార్ట్ ఎటాక్ల కారణంతో ప్రాణాలు పోతున్న తీరు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణ భయం కలుగుతుంది.

 ఇక మంచి ఫుడ్ తీసుకుని.. ప్రతిరోజు వ్యాయామం చేసిన ఏం లాభం.. ఇక ఇలా సడన్ హార్ట్ ఎటాక్లతో ప్రాణాలు పోతుంటే అని జనాలు కూడా అనుకుంటూ ఉన్నారు. అయితే ఇంకొన్నిసార్లు అనూహ్యమైన ఘటనలతో చివరికి ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవాలోకి చెందినదే. సాధారణంగా చలికాలం వచ్చిందంటే చాలు ఎక్కడికక్కడ చలి మంటలు కాచుకోవడం కనిపిస్తూ ఉంటుంది. ఇక కొంతమంది ఇంట్లో కుంపటి పెట్టుకొని ఇక వెచ్చదనం ఉండేలా చూసుకుంటూ ఉంటారు.

 ఇలా చలి నుంచి ఉపశమనం పొందేందుకు చేసిన పనే ప్రాణం తీస్తుంది అని ఎవరైనా అనుకుంటారా? కానీ ఇక్కడ మాత్రం అదే జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని ఆమ్రోహాలో ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చలికాలం కావడంతో వెచ్చగా ఉంటుంది అని ఇక కుటుంబం నిద్రపోయే గదిలో కుంపటి పెట్టుకున్నారు. అయితే దాని నుంచి పొగ ఇల్లు మొత్తం నిండిపోయింది. దీంతో ఊపిరాడక ఏకంగా 5 మంది  మృతి చెందినట్లు పోలీసులకు తెలిపారు. అయితే ఆ కుటుంబంలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే చలికాలంలో వెచ్చదనం కోసం ఇంట్లో ఇలాంటి కంఫర్ట్ పెట్టుకోకపోవడమే మంచిది అని చెబుతున్నారు పోలీసులు. అయితే చలికాలంలో వెచ్చదనం కోసం ఇంట్లో ఇలాంటి కుంపటి పెట్టుకోకపోవడమే మంచిది అని చెబుతున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: