పబ్జి గేమ్ కి అలవాటు పడ్డాడు.. చివరికి ప్రాణం పోయింది?

praveen
ఒకప్పుడు కాస్త ఖాళీ సమయం దొరికింది అంటే చాలు దగ్గరలో ఉన్న మైదానంలోకి వెళ్లి నచ్చిన ఆట ఆడుకునే వారు అందరూ. చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఒక చోట చేరి ఆడుకునేవారు. కానీ ఇటీవల కాలంలో వినూత్నమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపద్యంలో.. ప్రస్తుతం అందరి ఆట తీరు పూర్తిగా మారిపోయింది. అందరూ తమకు నచ్చినట్లుగానే పూర్తిగా కబడ్డీ క్రికెట్ లాంటి ఆటలను ఆడేస్తున్నారు.

 అంతకు ముందు ఉన్నట్లుగా మైదానంలో కాదు.. ఏకంగా అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో అందరూ కూడా ఆన్లైన్లో గేమ్ లు ఆడేస్తూ ఉన్నారు. ఇలాంటి గేమ్స్ కి అందరూ బానిసలుగా మారిపోతున్నారు అని చెప్పాలి. ఇలా ఎంతోమందిని బానిసగా మార్చుకున్న గేమ్ ఏదైనా ఉంది అంటే అది పబ్ జీ అని చెప్పాలి. ఎంతోమంది యువత, పెద్దలను ఇక ఈ గేమ్ బానిసలుగా మార్చుకొని పిచ్చివాళ్లను కూడా చేసింది. ఎంతోమంది ప్రాణాలను కూడా తీసేసింది. ఇటీవల పబ్జి గేమ్ మరో ప్రాణం పోవడానికి కారణమైంది అని చెప్పాలి.

 ఏకంగా ఎల్లారెడ్డి గూడలోని గుమ్మడి అపార్ట్మెంట్ లో ఉండే జయ కుమారుడు 21 ఏళ్ళ అఖిల్ అమీర్పేటలోని సిద్ధార్థ కాలేజ్ లో బీకాం సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే అతను పబ్జి ఆటకి బానిసగా మారిపోయాడు. కాలేజీకి కూడా వెళ్లడం మానేసి మొబైల్ లో pubg ఆడటం మొదలు పెట్టాడు. ఇటీవల స్నేహితురాలని కలిసేందుకు వెళ్ళింది జయ. ఈ క్రమంలోని రాత్రి సమయంలో ఆమెకు కొడుకు నుంచి వాట్సప్ మెసేజ్ వచ్చింది. అందులో బాయ్ మమ్మీ లవ్ యు జాగ్రత్త అని ఉండడంతో కంగారుపడ్డ ఆమె వెంటనే అఖిల్ కు  ఫోన్ చేసింది. రెస్పాన్స్ లేకపోవడంతో పరుగున ఇంటికి చేరుకుంది. తలుపులు లోపల నుంచి గడియ పెట్టి  ఉండడంతో వాచ్మెన్ సహాయంతో తలుపులు బద్దలు కొత్తగా.  లోపల సీలింగ్ ఫ్యాన్ కు అఖిల్ ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకోగా.. తన కొడుకు పబ్జి గేమ్ కి అలవాటు పడ్డాడు అని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: