
భార్య నల్లగా ఉందని.. విడాకులు కోరిన భర్త.. కోర్టు ఏం చెప్పిందంటే?
అయితే చిన్నచిన్న కారణాలకే ఏకంగా విడాకులు తీసుకుని విడిపోవడానికి సిద్ధమవుతున్నారు.. తప్ప కలిసి ఉండడానికి ఏదైనా మార్గం ఉంటుందేమో అని అసలు ఆలోచించడం లేదు. వెరసి ఇలాంటి తరహా ఘటనలు పెళ్లి అనే బంధం పై అందరికీ ఉన్న అభిప్రాయాన్ని మార్చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. అతనికి పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లి జరిగిన సమయంలో పిల్లలు పుట్టిన సమయంలో కూడా కనిపించని భార్య చర్మం రంగు.. గత కొంతకాలం నుంచి కూడా కనిపించడం మొదలైంది. దీంతో ఏకంగా భార్య నల్లగా ఉంది అంటూ విడాకులు కావాలని ఏకంగా భర్త కోర్టును ఆశ్రయించాడు అని చెప్పాలి.
ఈ ఘటన ఛత్తీస్గడ్ లో వెలుగులోకి వచ్చింది. అయితే ఇలా భార్య నల్లగా ఉంది. విడాకులు మంజూరు చేయాలంటూ భర్త రాగా.. ఏకంగా అతనికి చివాట్లు పెట్టింది హైకోర్టు. సమాజంలో చర్మం రంగు ఆధారంగా వివక్షను నిర్మూలించాలి అంటూ చతిస్ ఘడ్ హైకోర్టు పిలుపునిచ్చింది భార్య నల్లగా ఉందని విడాకులు కోరిన భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతన్ని పిటిషన్ తిరస్కరిస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే ఇది క్రూరత్వం అని భార్య తనను విడిచిపెట్టిందని భర్త వాదించినప్పటికీ కూడా కోర్టు అతని వాదనను తోసిపుచ్చింది అని చెప్పాలి. రంగు గురించి అవమానించి ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేశాడు అంటూ ఏకంగా భార్య కోర్టు ముందు వాపోయింది.