కొకైన్ వాడకాన్ని.. చట్టబద్ధం చేయబోతున్నారట?
ఈ క్రమంలోనే అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా తమ దేశంలో మాధక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించేందుకు మరింత కఠినమైన నిబంధన అమలులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఎవరైనా ఇలాంటి డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు అని తెలిస్తే కఠిన శిక్షలు విధిస్తూ ఉన్నాయి. కానీ ఇటీవల ఏకంగా స్విట్జర్లాండ్ లో మాత్రం నిషేధిత డ్రగ్స్ వాడకాన్ని చట్టబద్ధం చేసేందుకు సిద్ధమవుతూ ఉండడం కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ విషయం గురించి తెలిసి అటు ప్రపంచ దేశాలు కూడా షాక్ లో మునిగిపోతూ ఉన్నాయి.
ఏకంగా ప్రపంచం లోనే తొలి సారి స్విట్జర్లాండ్ రాజధాని లో వినోద కార్యక్రమాల లో కోకైన్ లాంటి నిషేధిత ప్రమాదకరమైన డ్రగ్స్ వాడకాన్ని చట్టబద్ధం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. అయితే ఈ పైలట్ ప్రాజెక్టుపై ప్రజల నుంచి మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అని చెప్పాలి. అయితే ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో పాటు ఇక ఇలాంటి నిర్ణయం కోసం ఫెడరల్ చట్టాన్ని కూడా మార్చాల్సి ఉంటుంది. అయితే డ్రగ్స్ పై పోరాటంలో విఫలమైనందున.. కొత్త ఆలోచనలు చేయాలి. పూర్తిగా నిరోధించడం కంటే నియంత్రణలో చట్టబద్ధం చేయడం లో ప్రయోజనం ఉండవచ్చు అని కౌన్సిల్ మెంబర్ ఒకరు తెలిపారు.