జైలు శిక్ష అనుభవించి.. విడుదలైన మేకలు.. ఇంతకీ ఏం చేశాయంటే?

praveen
సాధారణంగా నేరాలు చేసిన నిందితులను పోలీసులు పట్టుకొని జైల్లో పెడుతూ ఉంటారు. ఇక వారిని కోర్టులో హాజరు పరచడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే కోర్టులో హాజరు పరిచిన తర్వాత విచారణ చేసిన న్యాయస్థానం నేరం రుజువైతే ఆ నిందితుడికి శిక్ష విధించడం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్నాళ్లపాటు, ఎలాంటి శిక్ష అనుభవించాలి అన్న విషయాన్ని కోర్టు నిర్ధారిస్తూ ఉంటుంది అని చెప్పాలి. కోర్టు ఆదేశాల మేరకు నేరస్తులు ఇక జైలు శిక్ష అనుభవించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.


 అయితే ఇది సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ జరుగుతూ ఉంటుంది. నేరం చేసిన వారు తప్పకుండా జైలు శిక్ష అనుభవించడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే మనుషులు కాదు ఏకంగా జంతువులు జైలు శిక్ష అనుభవించడం గురించి ఎప్పుడైనా విన్నారా.. అది కూడా ఏడాది పాటు జైల్లో ఉండి విడుదలైన జంతువుల గురించి ఎప్పుడైనా తెలుసుకున్నారా. జంతువులు జైలు శిక్ష అనుభవించడమేంటి గురు.. అవి ఎందుకు నేరాలు చేస్తాయి అంటారు ఎవరైనా.. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటిదే జరిగింది.


 ఏకంగా ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించిన 9 మేకలు ఇటీవల జైలు నుంచి రిలీజ్ అయ్యాయి. బంగ్లాదేశ్ లో ఈ ఘటన వెలుగు చూసింది. భారీసల్ నగరంలోని ఒక స్మశాన వాటికలోకి చొరబడి గడ్డిమేసాయని భారీసల్ సిటీ కార్పొరేషన్ వాటిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన ఈ ఘటన జరిగింది. అయితే మేకల యజమాని ఏడాది పాటు వాటిని విడిచిపెట్టాలని కోర్టుల చుట్టూ తిరిగిన లాభం లేకుండా పోయింది.చివరికి శిక్షకాలం పూర్తి కావడంతో ఇటీవల ఆ మేకలను  విడుదల చేశారు . ఇలా మేకలను అరెస్ట్ చేసి శిక్ష విధించిన విచిత్రమైన ఘటన గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: