పెళ్లి చేసుకుందామన్న ప్రియురాలు.. కానీ అతనేం చేశాడో తెలుసా?
మరికొంతమంది తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే.. వారిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతూ ఉంటారు. ఇంకొంతమంది ఇక ప్రేమను గెలిపించుకోలేకపోయామే అనే మనస్థాపంతో చివరికి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణాలకు పాల్పడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి తరహా ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ప్రేమ అనేది మధురానుభూతులను పంచే బంధం కాదు ఏకంగా ప్రాణాలను తీసి ఒక నరకం అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రేమ కారణంగా మరో ప్రాణం బలైంది. ఏకంగా పెళ్లి చేసుకోవాలి అంటూ యువతి ఒత్తిడి చేయడంతో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ప్రేమించిన యువతి పెళ్లి విషయంలో ఒత్తిడి తేవడంతో.. ప్రియుడు సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పాలి. గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న ఆకాష్ అనే 29 ఏళ్ల యువకుడు అమీన్పూర్ ఆర్టీసీ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సహోద్యోగినిని ప్రేమించాడు. అయితే ఇటీవల ఆకాష్ ఇంటికి వెళ్ళిన ఆమె పెళ్లి చేసుకుందామని చెప్పింది. ఇక ఇప్పుడే వస్తానంటూ చెప్పి వెళ్లిన ఆకాష్ గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని ఫ్యాన్ కి ఉరేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.