పిల్లాడిని చంపేసిన కోతి.. వారంలో ఇది నాలుగో సారి?
ఇటీవల గుజరాత్ గాంధీనగర్ జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మనిషి స్వార్థపూరితంగా ఆలోచిస్తూ. ఇక అడవులను నరికేస్తూ భవనాలను నిర్మిస్తూ ఉన్నాడు. దీంతో అడవుల్లో ఉండాల్సిన జంతువులు కాస్త చివరికి జనావాసాల్లోకి వచ్చేస్తూ ఉన్నాయి. అయితే ఇలా ఎక్కువగా జనాల మధ్య కనిపించే జంతువులు ఏవి అంటే అవి కోతులు అని చెప్పేస్తుంటారు. అక్కడ అని తేడా లేదు. ప్రతి చోటా కోతుల బెడద ఇటీవల కాలంలో తీవ్రంగా వేధిస్తుంది. అయితే మనుషులకు బాగా అలవాటు పడిపోయిన కోతులు.. ఏకంగా జనాలపై దాడులు చేసేందుకు కూడా భయపడటం లేదు.
ఇక్కడ ఏకంగా కోతులు అభం శుభం తెలియని పిల్లాడిని పొట్టన పెట్టుకున్నాయ్. గుజరాత్ లోని గాంధీనగర్ జిల్లాలో ఏకంగా కోతి దాడిలో పదేళ్ల బాలుడు మరణించాడు. సల్కీ గ్రామంలో దీపక్ తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. అయితే ఒక్కసారిగా ఆ బాలుడు పై కోతి దాడి చేసింది. దీంతో అతడి పేగులు బయటకు వచ్చాయి. అయితే గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక ఆ గ్రామంలో ఈ వారంలో కోతుల దాడులు చేయడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అటు అధికారులు చెబుతున్నారు.