భర్త రోజు తాగొస్తున్నాడని.. భార్య చేసిన పనికి అందరూ షాక్?
ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కి పడేలా చేస్తూ ఉన్నాయి అనడం లో సందేహం లేదు. ఇక్కడ ఏకంగా మద్యానికి బానిస గా మారి పోయిన భర్త తీరుతో విసిగి పోయిన భార్య.. అతనిపై దాడి చేసిన తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలంలో వెలుగు చూసింది. ఏకంగా తాగి వచ్చిన భర్త ఒంటిపై వేడివేడి నీళ్లు పోసింది భార్య. అంతేకాదు కళ్ళల్లో కారం కొట్టింది. భార్య పెట్టిన చిత్రహింసలు భరించలేక భర్త చివరికి ప్రాణాలు కోల్పోయాడు.
ఘనపూర్ కు చెందిన భర్త వెంకటేష్ రోజు మద్యం తాగి వచ్చేవాడు. ఇక భార్యను సూటిపోటి మాటలతో హింసిస్తూ కొట్టేవాడు. అయితే ఎన్నిసార్లు చెప్పినా భర్త తీరులో మార్పు రాలేదు. దీంతో ఇక భార్య విజయ కూడా భర్త తీరుతో విసిగిపోయింది. ఎలాగైనా అతనికి బుద్ధి చెప్పాలని అనుకుంది. ఈ క్రమంలో ఇటీవల ఇంటికి తాగి వచ్చిన భర్తను తాళ్లతో బంధించి.. కళ్ళల్లో కారం చల్లి ఓంటిపై వేడి నీళ్లు పోసి చిత్రహింసలు పెట్టింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వెంకటేష్ ను ఆసుపత్రికితరలించగా.. తీవ్రగాయలతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య విజయను అరెస్టు చేశారు.