గంజాయికి బానిపై ప్రియుడు ఆత్మహత్య.. ప్రియురాలు ఏం చేసిందంటే?
ఎందుకంటే ప్రాణం కంటే ఎక్కువ అని ప్రేమించిన వారే మోసం చేస్తూ నడిరోడ్డు మీద వదిలేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఇక ఈ మోసాన్ని జీర్ణించుకోలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడం లాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మరి కొంతమంది ప్రేమను గెలిపించుకోవడానికి ఏకంగా పెద్దలను ఎదిరించి మరి పెళ్లి చేసుకుంటే.. పరువు హత్యలు పేరుతో దారుణంగా ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు అందరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయ్. ఇక్కడ ఓ ప్రేమకథ ఇలాగే విషాదంగా ముగిసింది. ప్రేమించిన వ్యక్తి చనిపోయాడని మనస్తాపంతో ప్రియురాలు కూడా ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటన యానం లో వెలుగు చూసింది. యూవీకే నగర్ కు చెందిన 22 ఏళ్ల మౌనిక రెండేళ్లుగా నిమ్మకాయల చిన్న అనే యువకుడితో ప్రేమలో ఉంది. అయితే గంజాయికి బానిసైన యువకుడు సోదరుడు గంజాయి కోసం 500 ఇవ్వలేదని.. ఇటీవలే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి చిన్న ఫోటోలను గోడకి అతికించి చూసుకుంటూ మౌనిక ఎంతో మానసిక వేదనకు గురి అయింది. చివరికి ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.