భార్యను చంపిన భర్తకు.. కోర్టు ఏం శిక్ష వేసిందో తెలుసా?

praveen
దాంపత్య బంధం అంటే అన్యోన్యతకు చిరునామాగా ఉండాలి. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ కలకాలం కలిసి ఉండాలి. అందుకే మనిషి జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా అటు దాంపత్య బంధం మాత్రం ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే  పెళ్లి అనే బంధంతో.. ఒకటైన ఇద్దరూ కూడా కలకాలం కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రాణంగా బ్రతుకుతూ ఉంటారు. కానీ ఇదంతా ఒకప్పటి మాట.. ఇక ఇప్పుడు కూడా ఇలాంటిది భార్యాభర్తల బంధం లో కనిపిస్తుంది. కానీ కేవలం సినిమాల్లో మాత్రమే కానీ నిజజీవిత విషయంలోకి వచ్చేసరికి భార్య భర్తల మధ్య అన్యోన్యత కనుమరుగవ్వటం అయిపోయింది అన్నది అర్థమవుతుంది.


 ఎందుకంటే దాంపత్య బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడునీడగా ఉండాల్సిన భార్యాభర్తలు.. ఏకంగా బద్ధ శత్రువులుగా మారిపోయి దారుణంగా పోట్లాడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే చిన్న చిన్న కారణాలకే ఏకంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్రమ సంబంధాల కారణంగా కొంతమంది భార్యాభర్తలు ఒకరిని ఒకరు చంపుకుంటుంటే.. ఇంకొంతమంది చిన్నచిన్న గొడవలకే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఇక ఇప్పుడు ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే అని చెప్పాలి.


 హైదరాబాద్ నగరంలో భర్త భార్యను చంపగా.. ఈ కేసులో కోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది. బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన వెంకటేష్ అనే 70 సంవత్సరాల వృద్ధుడు 2022 సంవత్సరంలో భార్యను చంపాడు. అయితే ఈ కేసులో పూర్తి విచారణ చేపట్టిన అనంతరం.. పోలీసులు ఆధారాలను కోర్టులో సమర్పించారు. ఈ క్రమంలోనే ఈ కేసు పై విచారణ జరిపిన కోర్టు ఇటీవల తీర్పును చెప్పింది. భార్యను హత్య చేసిన వెంకటేష్ కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది కోర్టు. ఇక దీనికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలి అంటూ అటు పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఆదేశించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: