జలపాతంలో దూకిన యువతి.. అంతలో ఊహించని ట్విస్ట్?
ఇక ఇలాంటి తరహా ఘటనలు ఎంతో మంది తల్లిదండ్రులకు కూడా కడుపు కోతని మిగులుస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఎంతో మంది యువతి యువకులు సెల్ఫోన్ కు బానిసగా మారి పోతున్నారు. చదువును పక్కన పెట్టేసి మరి సెల్ఫోన్లోనే కాలం గడిపేస్తున్నారు. అయితే ఎప్పుడైనా తల్లిదండ్రులు సెల్ ఫోన్ పక్కన పెట్టి చదువుపై దృష్టి పెట్టు అని మందలించారు అంటే చాలు ఇక మనస్థాపం చెంది బాధతో కఠిన నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఒక యువతి ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతుందని తల్లిదండ్రులు మందలించారు. ఈ క్రమం లోనే యువతి తీవ్ర మనస్థాపం చెందింది. ఇక తల్లిదండ్రులు మందలించడం తో తన జీవితాన్ని ముగించాలి అని అనుకుంది. ఈ క్రమంలోనే జలపాతం వద్దకు వెళ్లి ప్రమాదకరమైన రీతిలో చివరికి జలపాతం లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. అయితే అక్కడ జలపాతాన్ని చూడడానికి వచ్చిన ప్రయాణికులు వద్దు వద్దు అని ఎంత వారిస్తున్న యువతి జలపాతం లో దూకింది. దీంతో ఆమె పోయాయని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో మళ్ళీ ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేసింది యువతి. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.