కూతురి బర్త్ డేకి.. 400 కిలోల టమాటాలు పంచాడు?

praveen
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా టమాటా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారిగా కొండెక్కి కూర్చున్న టమాటా రేట్లు అటు సామాన్యులను బెంబేలెత్తిస్తు ఉన్నాయి. ఈ క్రమంలోనే వంటలకు రుచిని అందించే టమాటా క్రమక్రమంగా సామాన్యుడి వంటగదికి దూరమవుతుంది అని చెప్పాలి. కేవలం టమాట అంటే సంపన్నులకే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం టమాటా కిలో ధర 150 రూపాయల నుంచి 200 పైనే పలుకుతూ ఉంది అని చెప్పాలి. కేవలం ఒక్క రాష్ట్రంలో కాదు ప్రతి రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.


 ఈ క్రమంలోనే మునుపేన్నడు లేనంతగా టమాటా రైతులు కోట్లల్లో లాభాలు ఆర్జిస్తున్న.. సామాన్యుల పరిస్థితి మాత్రం రోజురోజుకు అద్వానంగా మారిపోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం టమాటా రేట్లు పెరిగిపోయిన నేపథ్యంలో  ఒక్కొక్కరు ఒక్కో విధంగా టమాటాను వాడుకుంటున్నారు. కొంతమంది పెరిగిపోయిన రేట్లు ఉద్దేశిస్తూ వినూత్నంగా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పాపులారిటీ సాధిస్తున్నారు. ఇంకొంతమంది తమ బిజినెస్ పెంచుకోవడానికి టమాటాలను ఆశ చూపుతు ఆఫర్లు ఇస్తున్నారు.


 ఇక్కడ ఒక వ్యక్తి అయితే మరింత వినూత్నంగా ఆలోచించాడు అని చెప్పాలి. తన కూతురు పుట్టిన రోజుకి ఏదైనా విలువైన బహుమతి ఇవ్వాలి అనుకున్నాడు.  ప్రస్తుత పరిస్థితుల్లో టమాటా కంటే విలువైనది ఇంకేది లేదనుకొని చివరికి వినూత్నంగా ఆలోచించాడు. ఏకంగా 400 కేజీల టమాటాలను పంపిణీ చేశాడు. హైదరాబాద్లోనే పంజాగుట్టకు చెందిన నల్ల శివ కూతురు బర్త్ డే సందర్భంగా 400 కేజీల టమాటాలను స్థానికులకు పంచాడు. ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో స్థానిక మహిళలందరూ కూడా ఈ కిలో టమాటాను తీసుకునేందుకు అక్కడికి క్యూ కట్టారు అని చెప్పాలి. ఇలా అతను టమాటాలు పంచడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలఇలా అతను టమాటాలు పంచడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: