మూడు కూడళ్ల వద్ద.. మట్టిబొమ్మ, నిమ్మకాయలు, నల్లకోడి.. అంతా భయం భయం?

praveen
ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఈ టెక్నాలజీ యుగంలోనే బ్రతికేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతున్న వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇంకా అక్కడక్కడ  క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాంటి క్షుద్ర పూజలు నేపథ్యంలో.. భయాందోళనలోనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే అని చెప్పాలి.

 పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన జనం క్షుద్ర పూజలతో వణికి పోతున్నారు. రాత్రయితే చాలు మంత్రగాళ్లు చేతబడులు చేస్తుండడంతో ఇక ఇంటి నుంచి కాలు బయట పెట్టలేక బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ముఖ్యంగా గురు, ఆదివారాలు అయితే మూడు నాలుగు రోడ్లు కలిసే కూడలి వద్ద క్షుద్ర పూజలకు సంబంధించిన సీన్ చూసి అందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు అని చెప్పాలి. ఇక ఆయా గ్రామాలలో ఎవరైనా అనారోగ్యం పాలయ్యారు అంటే చాలు మంత్రగాళ్లు  వారిని నాలుగు రోడ్ల కూడలి వద్ద కూర్చోబెట్టి క్షుద్ర పూజలు చేస్తూ ఉండడం అందరిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది.

 ఆదివారం రోజున మరోసారి శ్రీరాంపూర్ లో మూడు నాలుగు రోడ్ల కూడలి వద్ద క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి అని చెప్పాలి. విస్తరాకులో అన్నం ముద్దలకు పసుపు కుంకుమ పట్టించి.. నిమ్మకాయలు పెట్టి ఒక బొమ్మను తయారు చేసి.. ఇస్తరాకులో పెట్టారు. కోడిని కట్ చేసి అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేశారు. ఇక ఈ క్షుద్ర పూజలకు సంబంధించిన అన్ని వస్తువులను కూడా మూడు కూడళ్ల వద్ద ఉంచారు. అయితే ఇక ఉదయాన్నే లేచి రోడ్డుపైకి వెళ్ళిన జనాలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇలా క్షుద్ర పూజలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ అటూ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: