వైరల్ : పిడుగు పడటం.. స్లో మోషన్ లో ఇంత భయంకరంగా ఉంటుందా?
అయితే ఇలా వర్షాలు పడుతున్న సమయంలో పిడుగుపాటుకు సంబంధించిన వార్తలు.. ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి అని చెప్పాలీ. అయితే ఆకాశం నుంచి నుండి పిడుగు ఎలా పడుతుంది అన్న విషయం ఇక ఇలా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయే వీడియోల ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. అయితే పిడుగుపాటుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వరకు మీరు చూసే ఉంటారు. కానీ స్లో మోషన్ లో చూస్తే ఎంత భయంకరంగా ఉంటుంది అన్నది మాత్రం ఈ వీడియోలో చూడవచ్చు.
ఒకవైపు నుంచి భారీగా వర్షం కురుస్తుంది. ఇంకోవైపు నుంచి రోడ్డుపై కార్లు వెళ్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒక కారులో ఉన్న వ్యక్తి సరదాగా వర్షాన్ని వీడియో తీయాలి అని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఫోన్లో వీడియో ఆన్ చేశాడు. కానీ అందులో ఒక షాకింగ్ ఘటన రికార్డు అవుతుందని మాత్రం ఊహించలేకపోయాడు. వారి వాహనం ముందు వెళ్తున్న ఒక కారుపై పిడుగు పడింది. ఎంతో భయానక రీతిలో రెప్పపాటు కాలంలో ఆ కారు పిడుగుపాటుకు గురైంది. కాగా ఈ వీడియో స్లో మోషన్ లో ఉండడంతో పిడుగుపాటు ఎంత భయంకరంగా ఉంది అన్న విషయం అందరికీ స్పష్టంగా అర్థం అవుతుంది.