ఇలాంటి పిచ్చి పనులు చేశాక.. ఇంకా రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరగవు?

praveen
నేటితరం యువత మొత్తం సోషల్ మీడియా మాయలో మునికి తేలుతున్నారా అంటే ప్రతి ఒక్కరు కూడా అవును అని సమాధానమే చెబుతారు. ఎందుకంటే ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అంటూ ఇక కాలం గడుపుతున్న యువత ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అదే సమయంలో ఇలాంటి సోషల్ మీడియా మాయా ఎంతోమందిని ప్రమాదకర విన్యాసాలు చేసేలా కూడా చేస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇక సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఎంతోమంది చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు.



 ఇక ఆ వీడియోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేసి ఎక్కువ లైకులు పొందాలని ఆశపడుతున్నారు. ఇక కొంతమంది అయితే ఏకంగా ద్విచక్ర వాహనాలపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ఉండడానికి సంబంధించిన వీడియోలు కూడా చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి అని చెప్పాలి. ఇక ఇలా బైక్ పై విన్యాసాలు చేస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బందులకు గురి చేసిన వారిపై పోలీసులు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ఇంటర్నెట్ లోకి వచ్చి తెగచక్కర్లు కొడుతుంది. ఒక యువతి బైక్ మీద చేసిన స్టంట్ వైరల్ గా మారిపోయింది.


 ఆ యువతి చేసిన విన్యాసాలు చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. బీహార్ రాజధాని పాట్నాకు చెందిన హంటర్ క్వీన్ అనే యువతి వీడియో వైరల్ గా మారింది. ఇందులో మహిళా బైకర్ మెరైన్ డ్రైవ్ స్టంట్ చేస్తూ ఉండటం చూడవచ్చు. అయితే వీడియోలో ఆమె హైవేపై అత్యంత వేగంగా బైకు నడుపుతూ ఇక హ్యాండిల్ ను కూడా రెండు చేతులతో వదిలేసింది. ఆ తర్వాత బైక్ ని ఇష్టం వచ్చినట్టుగా నడుపుతూ ప్రయాణించింది. ఇక ఆ యువతి అంత వేగంగా బైక్ పై  వెళ్తున్నప్పుడు ఏ మాత్రం తేడా జరగిన.. చివరికి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయ్. అయినప్పటికీ ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేసింది యువతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: