ఇదెక్కడి విడ్డూరం.. రైలును ముందుకు నెట్టిన ప్రయాణికులు?

praveen
భారత రైల్వే  రవాణా వ్యవస్థకు వెన్నుముక్కగా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు వేలు లక్షల్లో కాదు ఏకంగా కోట్ల మంది ప్రయాణికులు రైలు ప్రయాణం ద్వారా రాకపోకలు సాగిస్తూ ఉంటారు అని చెప్పాలి. అంతే కాదు ఇక భారత రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థగా కూడా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక రైలు ప్రయాణాలు తక్కువ ఖర్చుతో ఉండడంతో ఇక ఎక్కువ మంది సామాన్యులు ఈ రైలు ప్రయాణాల ద్వారానే దూర ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న రైలు ప్రమాదాలు చూసిన తర్వాత కొంతమంది ప్రయాణికులు రైల్వే ప్రయాణం అంటేనే భయపడుతున్నారు.

 ఈ క్రమంలోనే రైళ్లల్లో సాంకేతిక సమస్యలు రావడానికి సంబంధించిన వార్తలు ఎన్నో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ట్విట్టర్ వేదికగా చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇప్పటివరకు ఇలాంటి ఘటన గురించి చూసి విని ఉండరు అని చెప్పాలి. సాధారణంగా కార్ సడన్గా ఆగిపోతే కొంతమంది వ్యక్తులు దానిని ముందుకు నెట్టి స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రయాణికులు ఏకంగా రైలు నెట్టడం వీడియోలో కనిపిస్తుంది.

 మార్గమధ్యమంలో ఆగిపోయిన రైలును ఏకంగా కారును నెట్టినట్టుగానే అధికారులు, ప్రయాణికులు ముందుకు నెట్టడం వీడియోలో చూడవచ్చు. అయితే లోకో పైలట్ రైలు ప్రారంభించడంలో ఆర్మీ జవాన్లు పోలీసులు మరియు ప్రయాణికులు సహాయపడతారు. ఇక దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఒక రూట్లో ఈ ఘటన జరిగిందట. రైలు ఆకస్మాత్తుగా ఆగిపోవడంతో జవాన్లు ప్రయాణికులు ఇలా రైలు నెట్టడానికి ప్రయత్నించారు అన్నది తెలుస్తుంది. ఈ వీడియో తెర మీదకి రావడంతో ప్రభుత్వం పై విమర్శలు రాగా.. ఇక రైల్వే మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. రైలులో అగ్నిప్రమాదం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: