ఇంస్టాగ్రామ్ లో పరిచయం.. అలా ఫోటోలు పంపమన్నాడు.. చివరికి?
అయితే ఇలా అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రేమ అనే వలవేసి ఎంతో మంది అమ్మాయిలను మోసం చేస్తున్న కేటుగాళ్లు కూడా చాలానే తెరమీదకి వస్తున్నారు. దీంతో ప్రియుడు చేతిలో మోసపోయి ఇక న్యాయం చేయాలంటూ ఎంతో మంది అమ్మాయిలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక ఇటీవల విజయనగరం జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది . ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన ఎంబీఏ విద్యార్థినిని ప్రేమ పేరుతో మోసగించి వికృత చేష్టలకు పాల్పడి బ్లాక్ మెయిల్ కి దిగాడు ఒక యువకుడు. చివరికి అతని అరెస్టు చేశారు పోలీసులు.
ముదినేపల్లి మండలానికి చెందిన ఒక యువతి హైదరాబాదులో ఎంబీఏ చదువుతుంది. అయితే ఆమెకు విజయనగరం జిల్లా జిఅమ్మ వలస మండలం బిట్రపాడుపల్లికి చెందిన నవీన్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటాడని మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపాడు. ఇక ఆ తర్వాత యువతిని వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యకరమైన ఫోటోలు పెట్టకపోతే చాకుతో కోసుకుంటాను తగలబెట్టుకుంటాను అంటూ బెదిరించాడు. ఇక భయపడిపోయిన యువతి అతను కోరిన విధంగానే ఫోటోలను పంపింది. చివరికి వాటిని ఆసరాగా చేసుకుని యువతని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. మొదట ఫోటోలు సోషల్ మీడియా పెడతారు అని పేరు నుంచి 25000 తీసుకున్నాడు. తర్వాత మళ్లీ అడగగా యువతి తండ్రికి విషయం చెప్పింది. ఇక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా పక్క ప్లాన్ ప్రకారం నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.