రెప్పపాటులో దూసుకొచ్చిన మృత్యువు.. షాకింగ్ వీడియో?
నాగాలాండ్ రాజధాని కోహిమా నుంచి దిమాపుర్‌వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనాలు అన్ని నిలిచిపోయాయి. ఇంతలోనే ఎత్తైన కొండపై నుంచి ఓ భారీ కొండచరియ రహదారిపై ఉన్న వాహనాలపైకి దూసుకొచ్చింది. కారు మీదికి వచ్చి పడడంతో కారు నుజ్జునుజ్జయింది. అక్కడితో ఆగకుండా ఆ రాయి మరో కారును కూడా ఢీకొట్టింది. దీంతో ఆ కారు కూడా ఆ దెబ్బకి ధ్వంసమైంది. ఈ ప్రమాదానికి సంబందించిన వీడియో వెనుక ఉన్న వాహనాల్లో కెమెరాలో రికార్డు అయ్యింది.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రమాదం గురించి తెలియగానే నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. అయితే ఈ వీడియో చూసిన వారందరు ఈ వీడియో షాక్ కి గురిచేసిందని కామెంట్లు పెడుతున్నారు. దీంతో పాటు ఇలాంటి ప్రమాదాన్ని ఇప్పటివరకు చూడలేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబందించిన వీడియో ట్విట్టర్ లో, నెట్టింట వైరల్ అవుతుంది.